ప్లాస్టిక్‌ను విక్రయించే బడా వ్యాపారులపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. తద్వారా ప్లాస్టిక్ నివారణ సాధ్యమవుతుంది. అలాకాకుండా చిరు వ్యాపారులకు జరిమానా విధించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మున్సిపాలిటిలో విపరీతంగా ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. అధికారులు స్పందించి చర్యలు చేపట్టి ప్రజల్లో అవగాహన పెంపొందించాలి.
–చందమూరి నారాయణరెడ్డి, 37వ వార్డు కౌన్సిలర్, ధర్మవరం
చర్యలు తీసుకుంటాం
మున్సిపాలిటి పరిధిలో ప్లాస్టిక్ కట్టడి కోసం కృషి చేస్తున్నాం. ప్రజల్లోనూ అవగాహన పెంపొందిస్తున్నాం. ప్లాస్టిక్‌ను విక్రయించే వ్యాపారులు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు చేపడతాం.
–ప్రమోద్‌కుమార్,
మున్సిపల్ కమిషనర్, ధర్మవరం
కఠిన చర్యలు తీసుకోవాలి