మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● మంత్రి సవిత
పెనుకొండ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ మార్కెట్‌యార్డ్‌లో ఆదివారం జిల్లా రచయితల సంఘం, త్రిపురా రిసార్ట్, ఎంక్యూయూఏ, ఘనగిరి లలిత కళాపరిషత్, బహుజన చైతన్య వేదిక తదితర సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. సభా అధ్యక్షుడిగా జాబిలి చాంద్‌బాషా, సమన్వయకర్తగా ఉద్దండం చంద్రశేఖర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ప్రతి కుటుంబం అభ్యున్నతి వెనుక మహిళ పాత్ర ఎంతో కీలకమన్నారు. తమ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించాలన్నారు. బాల్య వివాహాలు లేకుండా చూడాలని కోరారు. పెనుకొండలో షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఎస్పీ రత్న, షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ నిర్వాహకులు శిల్ప అనుపాటి తదితరులు మాట్లాడుతూ.. విద్యతోనే మహిళల జీవితం ఉన్నతంగా ఉంటుందన్నారు. అనంతరం మంత్రికి పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురికి మహిళా శిరోమణి పురస్కారాలను మంత్రి అందజేసి సత్కరించారు. సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రామ్మూర్తినాయుడు, శ్రీరాంయాదవ్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, సంస్థల నాయకులు గోపీనాథ్, ఖలీముల్లా, టిప్పు సుల్తాన్ సంస్థ ఉమర్‌ఫారూక్‌ఖాన్, పలువురు కవులు, కళాకారులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
Comments
Please login to add a commentAdd a comment