
25న చలో కలెక్టరేట్
పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈఎస్ వెంకటేష్ అధ్యక్షతన పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రాంభూపాల్ మాట్లాడుతూ... జిల్లాలో అర్ధంతరంగా ఆగిపోయిన జగనన్న ఇళ్లు, టిట్కో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో రెండు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలోనూ శ్మశానానికి భూమిని కేటాయించాలని, ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. రైతులకు నష్టం కలిగించే హంద్రీనీవా లైనింగ్ పనులు వెంటనే నిలిపివేయాలన్నారు. కూటమి పార్టీల నేతల ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, నరసింహులు, జంగాలపల్లి పెద్దన్న, దిల్షాద్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment