రాయదుర్గంటౌన్: మత్తు కలిగించే టోసెక్స్ సిరప్‌ను అనధికారికంగా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో రాయదుర్గంలోని బళ్లారి రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న శ్రీవిజయలక్ష్మి మెడికల్ స్టోర్‌ను జిల్లా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ హనుమన్న బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. టీడీపీ నాయకుడు చదం పశుపతనాథరెడ్డి అండతో ఆయన సోదరుడు హనుమానరెడ్డి అక్రమ దందా కొనసాగిస్తున్నట్లుగా నిర్ధారణ అయింది. బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన దాదాపు వెయ్యికిపైగా టోసెక్స్ సిరప్ బాటిళ్లను బల్క్‌గా అమ్ముతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. అలాగే వైద్యుడి స్కానింగ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తుండడం, ఫార్మాసిస్ట్ లేకపోవడం లాంటి మరో రెండు కేసులనూ నమోదు చేసి యజమాని హనుమారెడ్డికి నోటీసు జారీ చేశారు. అనంతరం పోలీసులు, సచివాలయ వీఆర్‌ఓల సమక్షంలో పంచనామా చేసి నివేదిక సిద్ధం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెడికల్ షాపును సీజ్ చేయనున్నట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. కాగా, రెండు వారాల క్రితం కర్ణాటకలోని చిత్రదుర్గలో కాలేజీ విద్యార్థులకు టోసెక్స్ సిరప్ విక్రయిస్తూ ముగ్గురు వ్యక్తులు అక్కడి పోలీసులకు పట్టుపడ్డారు. విచారణలో తాము రాయదుర్గంలోని విజయలక్ష్మి మెడికల్ స్టోర్‌లో కొనుగోలు చేసినట్లుగా నిందితులు అంగీకరించారు. దీంతో అప్పట్లో హనుమారెడ్డిని చిత్రదుర్గ పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవల బెయిల్‌పై విడుదలై వచ్చాడు. కర్ణాటక పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే విజయలక్ష్మి మెడికల్ స్టోర్‌ను తనిఖీ చేసినట్లుగా సమాచారం.
రాయదుర్గంలోని శ్రీవిజయలక్ష్మి
మెడికల్ స్టోర్‌లో అమ్మకాలు
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీల్లో
బయటపడిన టోసెక్స్ సిరప్
కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు