
ధర్మవరం రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతాం
ధర్మవరం: అత్యాధునిక సౌకర్యాలు కల్పించి ధర్మవరం రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతామని గుంతకల్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ విల్సన్‌బాబు తెలిపారు. మంగళవారం వారు ధర్మవరం రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న ఫ్లాట్‌ఫారం, విశ్రాంతి గది, బుకింగ్ కౌంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, ధర్మవరం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ కోసం కేంద్రం రూ.7.50 కోట్లు ప్రకటించిందన్నారు. ఇందులో తొలివిడతగా రూ.3.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. అలాగే జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ బలగాల కోసం నూతన భవనాలు నిర్మించేందుకు కూడా నిధులు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపడతామన్నారు. అలాగే రైల్వే ఆస్పత్రి నిర్మాణానికీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గూడ్స్‌షెడ్ కొట్టాల వైపు నుంచి వచ్చే ప్రయాణికుల కోసం బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రైల్వేస్టేషన్ మేనేజర్ చల్లా నరసింహ నాయుడు, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ సూర్యనారాయణ, బాబూజీరావు, సీనియర్ సెక్షన్ సివిల్ ఇంజినీర్ ఉమేష్‌కుమార్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
గుంతకల్లు రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి

ధర్మవరం రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతాం