
‘సంచార పశు ఆరోగ్య సేవలు ఆపేయండి’
కాశీబుగ్గ: పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించాలని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంచార పశు ఆరోగ్యసేవలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి చూస్తోంది. ఉన్న ఫలంగా సంచార పశు ఆరోగ్య సేవలను ఆపేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 మే 2022లో ప్రారంభించిన ఫేజ్–1లో 175 వాహనాలు తిరిగి ఆయా ఏడీ కార్యాలయంలో అప్పగించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఆయా వెహికల్స్‌లో పనిచేస్తున్న పైలెట్, పారావిట్, డాక్టర్, పైలెట్ రిలీవర్లు విధులకు హాజరు కాకూడదని వాట్సాప్‌లో సూచించారు. జిల్లాలో ఫేజ్–1లో 09 వాహనాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

‘సంచార పశు ఆరోగ్య సేవలు ఆపేయండి’
Comments
Please login to add a commentAdd a comment