గ్రూప్–2 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–2 మెయిన్ పరీక్షలు ఈ నెల 23న జరగనున్నాయని, వాటిని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించా రు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారు లు, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవె న్యూ అధికారి వెంకటేశ్వర రావుతో కలిసి సెంటర్ల వారీగా ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడు తూ, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని ఆదేశించారు. 23వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీని కోసం శ్రీకాకుళం, ఎచ్చెర్లలో మొత్తం 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 5535 మంది సభ్యులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొనే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment