విశిష్ట సంఖ్య రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి
నరసన్నపేట: ప్రజలకు ఆధార్ కార్డు లాగానే రైతులకు గుర్తింపు నంబర్లు తీసుకోవాలని జిల్లా వ్యవసా య శాఖ అధికారి త్రినాథస్వామి అన్నారు. మండలం కోమర్తి సచివాలయంలో రైతులకు విశిష్ట సంఖ్య రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందనే దానిపై ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. రైతులకు యూనిక్ ఐడీ చాలా ముఖ్యమని అన్నారు. ప్రభు త్వం నుంచి ఏ పథకం రైతులు పొందాలన్నా ఈ సంఖ్య ఉండాలని, రైతులు గమనించి సంబంధిత వీఏఏ వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అలాగే ఈ నెల 28 కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వీఏఏలకు ఆదేశించారు. కోమర్తి సచివాలయంలో రిజిస్ట్రేషన్ ఎలా ఉందని వీఏఏ కల్యాణిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ 190 మంది రైతుల పేర్లు రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. మిగిలిన రైతులు కూడా 28 కల్లా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు. అలాగే రబీ పంటల నమోదు ప్రక్రియ పై ఆరా తీశారు. జిల్లా వ్యవసాయాధికారి వెంట నరసన్నపేట ఏడీ రవీంద్రభారతి, మండల వ్యవసాయాధికారిణి కె. సునీత తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment