వాసుదేవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కాశీబుగ్గ: మందసలోని వాసుదేవుని బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దాసాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపట్టారు. మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశా రు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోష్ పండా, వివేక్ సాతుర్వేది, అనిల్ పండా తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల్లో భద్రతపై దిశానిర్దేశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలును కఠినంగా పరిశీలిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. పారిశ్రామిక యూనిట్లలో రసాయన ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అమోనియా, క్లోరిన్, ఎల్పీజీ, బ్యుటేన్ వంటి మండే స్వభా వం ఉన్న వాయువులను పెద్ద పరిమాణంలో వినియోగించే పరిశ్రమల్లో కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు ఉండాలన్నారు. తరచూ మాక్ డ్రిల్ నిర్వహించాలని, విష వాయువులు వెలువడే పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన తనిఖీల నివేదిక ఆధారంగా అన్ని పరిశ్రమలు మార్గదర్శకాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు.
పింఛన్ సొమ్ముతో విలేజ్ సర్వేయర్ పరారీ
జి.సిగడాం: మండలంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్న చదువుల భాను ప్రతాప్ రూ.49వేల పింఛన్ సొమ్ముతో పరారైనట్లు ఆ సచివాలయ సి బ్బంది సోమవారం తహసీల్దార్ ఎం.శ్రీకాంత్, ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావులకు ఫిర్యాదు చేశారు. గ్రామ సచివాలయంలో 2024 జూన్ నుంచి పింఛన్ల పంపిణీ బాధ్యతలను ప్రతాప్‌కు అప్పగించారు. ఈ నెలకు సంబంధించి 1లక్ష 66వేల రూపాయల గాను 1లక్ష 17 వేలు రూపాయలను పంపిణీ చేశాడు. మిగతా సొమ్ము రూ.49వేలు లబ్ధిదారులకు ఇవ్వకుండా పరారయ్యాడని సచివాలయ సిబ్బంది ఫిర్యా దులో పేర్కొన్నారు. సంబంధిత పింఛన్ లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా సచివాలయ సిబ్బంది తమ సొంత నిధులు రూ. 33వేలు వెచ్చించి ఇచ్చారు. మరో రూ.16వేలు మృతి చెందిన లబ్ధిదారుల పింఛన్లని, వీటిని ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉందన్నారు.
శివరాత్రి ఉత్సవాలకు పక్కాగా బందోబస్తు
జలుమూరు: శ్రీముఖలింగంలో శివరాత్రికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాలపై అర్చకులు, ఆలయ అధికారులు, పోలీసు అధికారులతో మాట్లాడారు. దక్షిణ ద్వారం గుండా వీఐపీల దర్శనాలను రద్దు చేయాలన్నారు. సామాన్యులు సులభంగా స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోప్ పార్టీలు అదనంగా ఏర్పాటు చేయాలని టెక్కలి డీఎస్పీ డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తికి ఆదేశించారు. చక్రతీర్థ స్నానాలకు అదనపు బందోబస్తు ఉండాలని, రోడ్డు, నది మార్గాలు శుభ్రం చేయాలని సూచించారు. గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదన్నారు. దీనికి ముందు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు సీఐలు ఇమ్మాన్యుయేల్ రాజు, జె.శ్రీనివాస్, సత్యనారాయణ, ఎస్‌ఐలు అశోక్‌బాబు సిబ్బంది పాల్గొన్నారు.
వాసుదేవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వాసుదేవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment