మంత్రి అండతో మైనింగ్ దోపిడీ
టెక్కలి: జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అండతో కింజరాపు కుటుంబం మైనింగ్ దోపిడీలు, ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడుతున్నారని, రాజస్థాన్‌కు చెందిన కొంత మంది బ్రోకర్లతో క్వారీలు, గ్రానైట్ పరిశ్రమల నుంచి కమీషన్‌ల దుకాణాలు తెరిచారని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ దుయ్యబట్టారు. సోమవారం టెక్కలి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి పా లనలో గ్రామస్థాయి నుంచి కక్ష సాధింపు చర్యల కు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ఎన్నికల మును పు ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలపై కనీసం దృష్టి సారించడం లేదన్నారు. ఇటీవల చంద్రబాబు ప్రకటించిన పాలనాపరమైన ర్యాంకింగ్‌లో జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుకు 17వ ర్యాంకు వచ్చిందని, అయితే కక్ష సాధింపుల్లో మా త్రం మొదటి ర్యాంకులో ఉన్నారని తిలక్ ఎద్దేవా చేశారు. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు రైతులను పట్టించుకోకుండా ఏం వెలగబెడుతున్నారని నిలదీశారు. గతంలో అనేక కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన బోయిన రమేష్‌కు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యతలు అప్పగించి ధాన్యం కొనుగోలులో మంత్రి సోదరుడు హరిప్రసాద్ నేతృత్వంలో కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని తిలక్ దుయ్యబట్టారు. వైఎస్ జగన్ హయాంలో పోర్టు పనులు మొదలయ్యాయని, దానికి అనుసంధానంగా రోడ్లకు ప్రతిపాదిస్తే.. ఆ రోడ్లు తామే ఇచ్చామంటూ బాబాయ్, అబ్బాయ్‌లు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, దళితులపై కూటమి నాయకులు దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోకుండా తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. దీనిపై తిరుగుబాటు తప్పదన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీసులు, విజిలెన్స్ ఎస్పీ కూటమిగా చేరి కింజరాపు కుటుంబం చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, పార్టీ నియోజకవర్గ స్థాయి వివిధ అనుబంధ విభాగాల నాయకులు ఎస్.సత్యం, జీ.వి.రెడ్డి మాష్టారు, ఎస్.హేమసుందర్‌రాజు, ఆర్.మల్లయ్య, బి.మోహన్‌రెడ్డి, కె.సంజీవ్, డి.రామకృష్ణారెడ్డి, పోలాకి మోహన్, పి.వెంకట్రావు, దివాకర్, ఎన్.భీమారావు, కె.జీవన్, కె.రామరాజు, బి.వెంకటరమణ, పి.మోహన్, పి.బాలకృష్ణ, మదీన్, హెచ్.గోవిందరావు, పి.కరుణాకర్, ఎ.మల్లేష్, హెచ్.లక్ష్మణ్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్
Comments
Please login to add a commentAdd a comment