
కష్టార్జితం కాలిపోయింది..
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని తేలుకుంచి గ్రామంలో బుధవారం షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో కిరాణా షాపు దగ్ధమైంది. కష్టపడి దాచుకున్న సొమ్ము కాలిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుడియా బిమ్మో ఇంట్లోనే కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం వేకువజాము ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే అత్తమ్మ వైద్యం కోసం పెట్టెలో భద్రపరిచిన మూడు లక్షల రూపాయల నగదు కాలిపోయాయి. రెండు ఫ్రిజ్‌లు, కిరాణా సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు మూడున్నర లక్షల రూపాయల సామాన్లు కాలిపోయినట్లు అగ్నిమాపకాధికారులు కె.ప్రశాంత్, సూర్యారావు తెలిపారు. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, సర్పంచ్ పాతిర్ల రాజశేఖరరెడ్డి పరామర్శించారు.
షార్ట్ సర్క్యూట్‌తో షాపు దగ్ధం
కాలి బూడిదైన రూ.3 లక్షల నగదు
Comments
Please login to add a commentAdd a comment