
కన్నుమూత
బండారు చిట్టిబాబు
చిట్టిబాబు పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ గాయకులు
బి.ఎ.నారాయణ,
మండపాక శారద
శ్రీకాకుళం కల్చరల్: లలిత సంగీతానికి ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సంగీత కళాకారుడు బండారు చిట్టిబాబు(89) బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. హార్మోనియం కళాకారుడిగా, ఆర్కెస్ట్రా నిర్వాహకుడిగా సుమారు ఏడు దశాబ్దాల పాటు కళామతల్లి సేవలో తరిస్తూ ఎంతో మంది గాయకులను తీర్చిదిద్దారు. 1936లో బండారు సత్యనారాయణ, వరాలమ్మ దంపతులకు 5వ సంతానంగా జన్మించిన చిట్టిబాబు సంగీతంలో అసమాన ప్రతిభతో రాణించారు. 400కుపైగా లలిత గీతాలకు స్వరకల్పన చేశారు. ప్రముఖ సినీ నటులు రావి కొండలరావు, తిమ్మరాజు శివరావుల సహకారంతో 1955లో సుకుమార్ ఆర్కెస్ట్రాను నెలకొల్పారు. సినీ రచయితలు దేవులపల్లి, ఆరుద్ర, సినారె, జొన్నవిత్తుల, దూసి ధర్మారావు తదితరులు రచించిన లలిత గీతాలకు స్వరకల్పన చేస్తూ హార్మోనియంపై వాయిద్య సహకారం అందించారు. ‘అంటరాని వారు ఎవరంటే’, ‘ఏది హిందూ.. ఏది ముస్లిం’ వంటి పాటలను జాతీయ భాషల్లో కూడా స్వరపరిచారు. ప్రముఖ సినీ గాయకులు జి.ఆనంద్, బి.ఎ.నారాయణలతో కలిసి రథసప్తమి సందర్భంగా ఏకాంత సేవ నిర్వహించారు. 1974లో రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం, 1983లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా కళాప్రవీణ బిరుదులు అందుకున్నారు. 1984లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సభ్యునిగా ఎనలేని సేవలు అందించారు. ఈయన కుమారుడు బండారు రమణమూర్తి తబలా కళాకారుడిగా ఏ–గ్రేడ్ ఆర్టిస్టుగా పేరుగాంచారు.
70 ఏళ్లుగా సంగీత సేవ
నివాళులర్పించిన ప్రముఖులు
ప్రముఖుల సంతాపం..
చిట్టిబాబు మృతి సంగీతానికి తీరని లోటని గాయకులు నిక్కు అప్పన్న, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, తరుణి కృష్ణ సంస్థ ప్రతినిధులు మండా శ్రీనివాసరావు, ఎం.వి.కామేశ్వరరావు, ఉపనిషన్మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్, సుమిత్రా కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ, రంగస్థల కళాకారుల సమాఖ్య గౌరవ అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి, చిట్టి వేంకటరావు, రామచంద్రదేవ్, పన్నాల నరసింహమూర్తి, ప్రముఖ గాయకులు బి.ఏ.నారాయణ, మండపాక శారద, కె.ఎల్.ఎన్ మూర్తి, కళ్యాణం రామ్మోహన్‌రావు, తదితరులు సంతాపం తెలియజేశారు.

కన్నుమూత

కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment