
గోకార్టింగ్ సీజన్–2 ప్రారంభం
టెక్కలి: ఆటో మొబైల్ రంగంలో నూతన సాంకేతిక ఆవిష్కరణల దిశగా విద్యార్థులు ఆలోచనలు చేయాలని హైదరాబాద్‌కు చెందిన డీప్‌లూప్ టెక్నాలజీ సీఈవో కుసుమంచి సూర్యప్రకాశ్ కోరారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల వేదికగా జాతీయ స్థాయి గోకార్టింగ్ సీజన్–2 పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో మొబైల్ రంగంలో నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో పోటీలు నిర్వహిస్తున్న ఆదిత్య కళాశాలకు అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులను అభినందించారు. కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టంకాల నాగరాజు, డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావులు మాట్లాడుతూ.. తమ కళాశాలలో జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీలు రెండోసారి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మొత్తం 16 బృందాలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గోకార్టింగ్ కన్వీనర్ ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కో–కన్వీనర్లు డి.శ్రీరాములు, ఈసీఈ హెచ్‌వోడీ వి.అశోక్‌కుమార్, సీఎస్‌ఈ హెచ్‌వోడీ వై.రమేష్, ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్లు రఘువీర్, విద్యార్థి కన్వీనర్లు పి.ఉదయ్‌కుమార్, బి.సాయి సాకేత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment