ఎచ్చెర్ల: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవాలని లావే రు తహశీల్దార్ జోగారావు సిబ్బంది ని ఆదేశించారు. శుక్రవారం తామా డ, బుడతవలస పంచాయతీల రెవె న్యూ పరిధిలో అక్రమంగా చదును చేస్తున్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ చదునుచేసిన భూ ముల్లో సర్వే చేపట్టి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఈయనతో పాటు ఆర్‌ఐ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.