జి.సిగడాం: యువతిని మోసగించిన కేసులో దేవరవలస గ్రామానికి చెందిన సిగటాపు కిరణ్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రణస్థలం సీఐ అవతారం తెలిపిన వివరాల ప్రకారం.. దేవరవలసకు చెందిన కిరణ్ అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు కోరడంతో నిరాకరించాడు. పెద్దలను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితురాలు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ వై.మధుసూదనరావు, ఏఎస్‌ఐ కె.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.