
458 పోస్టులకు పోటీ
శ్రీకాకుళం: సుమారు 16,500 పోస్టులతో డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. జిల్లాకు సంబంధించి 458 పోస్టుల కోసం నో టిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో 347 స్కూల్ అ సిస్టెంట్లు, 111 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అవలంబించిన అస్తవ్యస్త విధానాలతో ఇప్పటికే జిల్లాలో పలువురు ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు మిగులు ఉద్యోగులుగా ఉన్నారు. వీరిని సర్దుబాటు చేయటమే విద్యా శాఖ అధికారులకు తలనొ ప్పిగా ఉండగా డీఎస్సీ పోస్టుల భర్తీ తర్వాత కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారు కూడా మిగులు ఉపాధ్యాయులుగా ఉండే దుస్థితి ఏర్పడుతోంది. దీన్ని కప్పి పుచ్చుకునేందుకు జూన్ 6 నుంచి జూలై 6 వరకు 30 రోజుల పాటు సుదీర్ఘ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నా యి. ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసాంతం వరకు 1989, 1992, 1994 డీఎస్సీల్లో భర్తీ అయిన పలువురు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. ఆయా ఖాళీల్లో ఇప్పటికే మిగులుగా ఉన్న ఉపాధ్యాయు లను సర్దుబాటు చేసి డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయలను మిగులు ఉపాధ్యాయులుగా చూపించే పరిస్థితి ఉంటుంది.
ఒక్కో బడిలో ఒక్కో నిష్పత్తి
ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు 117 జీఓను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ దాని కంటే అన్ని వర్గాలకు నష్టం కలిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను తీసి వేయాలని ఉపాధ్యాయులు కోరుతుండగా అందుకు వ్యతిరేకంగా 1, 2 తరగతులను కూడా కొన్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి దానికి ‘బేసిక్ ప్రైమరీ స్కూల్’ అని నామకరణం చేశారు. జిల్లాలో ఇలాంటి పాఠశాలలు 130 వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్ఫత్తి 1:9 ఉండగా మోడల్ ప్రైమరీ స్కూల్స్‌లో 1:11 ఉంది. బేసిక్ ప్రైమరీ స్కూల్స్‌లో 1:20 నిష్పత్తిని, పౌండేషన్ స్కూల్స్‌లో 1:30గా ఉంచాలని నిర్ణయించింది. ఇది పూర్తిగా అశాసీ్త్రయం అని విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో పోస్టుల వివరాలు
జిల్లాలో 458 పోస్టులను ప్రకటించగా వీటిలో 347 స్కూల్ అసిస్టెంట్లు, 111 ఎస్జీటీ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లో 335, మున్సిపాలిటీ ల్లో 12 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సబ్జెక్ట్‌ల వారీగా పరిశీలిస్తే ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు–34, హిందీ–11, ఇంగ్లిష్–64, గణితం–33, ఫిజికల్ సైన్స్–14, బయోలాజికల్ సైన్స్–32, సాంఘిక శాస్త్రం–66, పీడీ–81 పోస్టులు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు–3, హిందీ–1, ఇంగ్లిష్–1, బయోలాజికల్ సైన్స్–1, సాంఘిక శాస్త్రం–5, పీడి–1 పోస్టులు ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు విషయానికి వస్తే జిల్లా పరిషత్, ప్రభుత్వ యాజమాన్యాల్లో–72, మున్సిపాలిటీల్లో –39 పోస్టులు ఉన్నాయి. వీటికి గట్టి పోటీ ఏర్పడనుంది. జిల్లా వ్యాప్తంగా 25 వేల వరకు నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా 458 పోస్టులకు పోటీ పడాల్సి ఉంది.
జిల్లాలో 458 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్
వీటిలో 111 ఎస్జీటీ పోస్టులు
347 స్కూల్ అసిస్టెంట్ల్ పోస్టుల భర్తీ
మిగులు పోస్టులుగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు
డీఎస్సీ భర్తీ పోస్టులు కూడా మిగులుగా
ఉండే దుస్థితి
రెండు మూడు రోజుల్లో ఓ రూపు
జిల్లాల్లో ఖాళీ పోస్టులు, మిగులు పోస్టుల వివరాలు రెండు, మూడు రోజుల్లో తేలనుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాల మేరకు కసరత్తు చేస్తున్నాం. కొన్ని మండలాల్లో మిగులు ఉపాధ్యాయులు ఉండటం వాస్తవమే.
– తిరుమల చైతన్య, డీఈఓ, శ్రీకాకుళం

458 పోస్టులకు పోటీ