
●దోషులను కఠినంగా శిక్షించాలి
బైరిలో వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చేసిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. అందరి గుండెల్లో ఆయన చిరంజీవిగా నిలిచి ఉంటారు. అలాంటి వారి మనోభావాలను దెబ్బతీసేందుకు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి.
– రెడ్డి శాంతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు