ఉపాధ్యాయుల పరస్పర బదిలీలలు
రూ.10లక్షల నుంచి రూ.15 లక్షలకు బేరసారాలు
ఉపాద్యాయ సంఘాల
నేతలకు కమీషన్‌లు
జూన్ నెలలో ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయులను గుర్తించి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దూర ప్రాంతాల్లో ఉన్న మహిళ ఉపాధ్యాయులతో పరస్పర బదీలలకు ఒప్పించడానికి కొన్ని ఉపాద్యాయసంఘాల నేతలు రంగంలోకి దిగారు. దీని కోసం వారు ఇరువైపుల భారీగా కమీషన్‌లు వసూలు చేస్తున్నట్లు కొందరు టీచర్లే ఆరోపిస్తున్నారు. పది లక్షల రూపాయలకు బేరం కుదిర్చితే ఇరువైపులా రూ.లక్ష చొప్పున రెండు లక్షల రూపాయలను కమీషన్‌గా తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో ఈబదిలీలుకు బ్రేక్ పడింది. కోడ్ ముగియగానే ఈ జాక్‌పాట్ బదిలీలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని కొందరు టీచర్లు అంటున్నారు.
కోదాడ: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం కల్పించిన అవకాశం కొందరికి కాసులు కురిపిస్తోంది. దూరప్రాంతాల్లో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయులు సొంత ప్రాంతానికి రావడానికి లక్షల రూపాయలు ఇస్తామంటూ ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బేరసారాలకు కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు.
రెండు నెలలు ఇబ్బంది పడితే..
ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఈ సంవత్సరం జూన్ నెలలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనుంది. ఆ తరువాత వేసవి సెలవులు వస్తాయి. పాఠశాలలు తిరిగి జూన్‌లో తెరుస్తారు. అప్పటి వరకు వీరు ఉద్యోగ విరమణ చేస్తారు. కాబట్టి మార్చి, ఏప్రిల్ రెండు నెలల పాటు కొంత ఇబ్బంది పడితే లక్షల ఆదాయం వస్తుందని పలువురు ఈ స్కీంకు ఒప్పుకుంటున్నట్లు సమాచారం. ఇక పోతే కొందరు అక్కడ జాయిన్ అయిన తరువాత సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉంటే సరిపోతుందని, రిటైర్‌మెంట్ వారం ఉందనగా తిరిగి విధుల్లో చేరితే సరిపోతుందని చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఫ జిల్లాకో రేటు చెబుతున్న ఉపాధ్యాయులు
ఫ ఐదారు నెలల్లో రిటైర్మెంట్ అవుతున్న వారికి జాక్‌పాట్
ఫ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు
ఫ జిల్లాలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం
కోదాడకు చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు 317 జీఓలో నిజమాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆమె తిరిగి కోదాడకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆమె ఒక సరి కొత్త మార్గాన్ని ఎంచుకుంది. కోదాడ పరిసర ప్రాంతాల్లో మరో ఐదారు నెలల్లో ఉద్యోగ విరమణ చేసే వారిని సంప్రదించారు. తాను మ్యూచ్‌వల్ మీద కోదాడకు వస్తానని, మీరు నిజామాబాద్ వెళితే రూ.15లక్షలు ఇస్తానని ఆఫర్ చేశారు. దీనికి సదరు ఉపాధ్యాయుడు ఓకే చెప్పడంతో ఆయన నిజమాబాద్‌కు, ఆమె కోదాడకు రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కోదాడ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో మరో ఆరునెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుడు మహబూబ్‌నగర్ జిల్లాలో పని చేస్తున్న మహిళ ఉపాధ్యాయురాలికి పరస్పర బదిలీ ఇవ్వడానికి అంగీకరించారు. దీని కోసం ఆయన ఏడు లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు
ఇలా కోదాడతో పాటు జిల్లా వ్యాప్తంగా ఈ తంతు జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment