నీటి ఎద్దడి తలెత్తవద్దు
ఫ కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్
సూర్యాపేట: జిల్లాలో వచ్చే మూడు మాసాల్లో ఎక్కడ కూడా నీటి ఎద్దడి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట మండలం ఇమాంపేటలోని మిషన్ భగీరథ నీటిశుద్ధి 90ఎంఎల్‌డీ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటిశుద్ధి కేంద్రం పరిధిలోని రెండు మున్సిపాలిటీలు సూర్యాపేట, కోదాడ, మండలాలు చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, పెన్‌పహాడ్, సూర్యాపేట పరిధిలోని గ్రామాలు, ఆవాసాలు, విలీన ఆవాసాలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా వేసవిలో నిరంతరం జరగాలన్నారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్‌రెడ్డి, గ్రిడ్ ఈఈ శ్రీనివాసరావు, ఇంట్రా డీపీఓ నారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మిషన్ భగీరథ డీఈ రాజేందర్, పాండు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు ఉచిత న్యాయసేవలు వినియోగించుకోవాలి
చివ్వెంల : ప్రజలు ఉచిత న్యాయసేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి కోఆరు. పెద్దగట్టు జాతరలో డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించి మాట్లాడారు. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని దీనివల్ల ఇరువర్గాల వారు గెలిచిన వారవుతారన్నారు. సమయం, ధనం వృథా కాకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు వసంత సత్యనారాయణపిళ్లే యాదవ్, బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి
హుజూర్‌నగర్ : ఈ నెల 27 న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలుగుబెల్లి నర్సిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి కోరారు. బుధవారం హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని పలు పాఠశాలలను సందర్శించిన అనంతరం హుజూర్ నగర్ టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సిరెడ్డి మాత్రమే ఆరేళ్లుగా నిజమైన ఉపాధ్యాయ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమావేశంలో ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు జెట్టి కమల, ఆర్. దామోదర్, చెన్న సైదులు, బాల సైదిరెడ్డి, శ్రీమన్నారాయణ, చిరంజీవి, గోవింద శీను, వి. రామకృష్ణ, ప్రభాకర్ రెడ్డి, చిక్కుళ్ల గోవిందు, ఆర్ . రామకృష్ణ, లక్ష్మీకాంత్, శ్రీనివాస రెడ్డి, స్రవంతి, జ్యోతి, కిరణ్ బాబు, చంద్రశేఖర్, సైదులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా సారథిగా మహిళకు అవకాశం
హుజూర్ నగర్ : బీజేపీ జిల్లా సారథి పదవి మహిళకు దక్కింది. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మున్సిపల్ మాజీ వైస్‌చైర్‌పర్సన్ చల్లా శ్రీలత రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమెరకు ఆ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆమె నిబద్ధతను గుర్తించిన అధిష్టానం జిల్లా పార్టీ బాధ్యతలను అప్పగించింది.
నీటి ఎద్దడి తలెత్తవద్దు
నీటి ఎద్దడి తలెత్తవద్దు
నీటి ఎద్దడి తలెత్తవద్దు
Comments
Please login to add a commentAdd a comment