సాగునీటి సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేయాలి
ఫకలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
సూర్యాపేట: ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని వ్యవసాయ భూములకు విడతల వారీగా సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట మండలం దాస్‌తండా వద్ద ఉన్న ఎస్సారెస్పీ పరిధిలోని 71డీబీఎంను పరిశీలించి మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడెక్కడ సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారో గుర్తించాలన్నారు. ఆయా ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ సాగునీరు సరఫరా చేయాలని సూచించారు. మొదటి మూడు రోజులు ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట, చివ్వెంల మండలాలకు, తదుపరి మూడు రోజులు మోతె, పెన్‌పహాడ్, నడిగూడెం, మునగాల మండలాల పరిధిలోని భూములకి సాగునీరు అందించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. డీబీఎం 22 ద్వారా మోతె మండలానికి సాగునీరు సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల సీఈ రమేష్‌బాబు, ఎస్‌ఈ శివధర్మతేజ, ఈఈ శ్రీనివాసరావు, డీఈ రమేష్, ఏఈలు ఉదయ్, లింగయ్య, పాండు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment