ఆదా చేస్తేనే ‘గృహజ్యోతి’ | - | Sakshi
Sakshi News home page

ఆదా చేస్తేనే ‘గృహజ్యోతి’

Published Fri, Feb 21 2025 8:07 AM | Last Updated on Fri, Feb 21 2025 8:04 AM

ఆదా చ

ఆదా చేస్తేనే ‘గృహజ్యోతి’

విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి

వేసవిలో విద్యుత్‌ను వినియోగదారులు పొదుపుగా వాడుకోవాలి. గృహజ్యోతి వినియోగదారులు విద్యుత్‌ను 200 యూనిట్ల కంటే ఎక్కువగా వాడితే వారు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. బిల్లుల భారం నుంచి గట్టెక్కాలంటే విద్యుత్‌ను పొదుపు వాడుకోవడమే మార్గం.

– శ్రీనివాస్‌,

విద్యుత్‌ శాఖ డీఈఈ, సూర్యాపేట

నాగారం: వేసవి నేపథ్యంలో ప్రజలు ఎండ వేడికి తాళలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి తాపం నుంచి రక్షించుకోవడానికి ఏసీలు, కూలర్లు వాడుతుండటంతో ఫిబ్రవరి మొదటి వారంలోనే విద్యుత్‌ వినియోగం పెరిగిపోతోంది. ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డుదారులకు గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు జీరో బిల్లులు జారీ చేస్తున్నారు. అయితే విద్యుత్‌ను విచ్చలవిడిగా వాడితే ఈ పథకం వర్తించకుండా పోయే ప్రమాదముంది. 200 యూనిట్లకు ఒక్క యూనిట్‌ అదనంగా వచ్చినా బిల్లు కట్టాల్సిందే. ఒకవైపు వేసవి తాపం... మరో వైపు విద్యుత్‌ బిల్లుల భారం.. ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాల్సిన పరిస్థితి. దీని నుంచి గట్టెక్కాలంటే విద్యుత్‌ను పొదుపు చేసుకోవడమే మార్గం. ఉపకరణాలను పూర్తిగా కట్టేయాల్సిన అవసరం లేకుండా విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే నిరంతరాయంగా గృహజ్యోతిని వెలిగించొచ్చు. కాగా.. జిల్లాలో జనవరికి సంబంధించి 1,79,550 మంది గృహజ్యోతి లబ్ధిదారులు ఉన్నారు.

ఇలా చేద్దాం..

దాదాపు అన్ని ఇళ్లలో ఎస్‌ఈడీ బల్బులు వినియోగిస్తున్నారు. అయితే ఇప్పటికీ కొందరు ఫ్లోరోసెంట్‌ ట్యూబ్‌ లైట్లు వాడుతున్నారు. వీటి సామర్థ్యం 40 వాట్స్‌ ఉండటంతో విద్యుత్‌ వినియోగం మరింత పెరిగే అవకాశముంది. దీని దృష్ట్యా ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు మేలు.

● ఏసీలు 24 నుంచి 29 డిగ్రీల మధ్య ఉపయోగిస్తే చల్లదనంతో పాటు బిల్లు ఆదా అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇన్వర్టర్‌తో కూడిన ఏసీలు లభిస్తున్నాయి. గది చల్లబడగానే ఆటోమెటిక్‌గా ఏసీ నిలిచిపోతుంది. వీటితో కొంత విద్యుత్‌ వి నియోగం తగ్గే అవకాశముంది. సాధారణ ఏసీలు కరెంటు పోయి వచ్చినప్పుడు పునఃప్రారంభమయ్యే సమయంలో లోడ్‌ పెరుగుతుంది. ఇది విద్యుత్‌ సరఫరా వ్యవస్థపై భారం పడుతుంది.

● సీజన్‌ మేరకు ఫ్రిజ్‌లో ఫ్రీజర్‌ దశలు మారుస్తూ ఉండాలి. వేసవిలో ఎక్కువ ఉంచినా మిగిలిన కాలాల్లో తగ్గించుకోవాలి. మంచు పొరలు పావు వంతు పెరిగినట్లు గమనిస్తే వెంటనే డీప్రాస్ట్‌ ఆప్షన్‌తో తొలగించాలి.

● ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఎల్‌ఈడీ బల్బులు, రిఫ్రిజిరేటర్లు తదితర విద్యుత్‌ గృహోపకరణాలు 5 స్టార్స్‌ ఉంటే విద్యుత్‌ వినియోగం తగ్గి బిల్లు ఆదా అవుతుంది.

● కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు అవసరం లేని సమయంలో స్విచ్‌ఆఫ్‌ చేయాలి. ఫోన్‌ చార్జింగ్‌ పూర్తయ్యాక ఛార్జర్‌ను ప్లగ్‌ నుంచి తొలగించాలి.

ఫ వేసవి దృష్ట్యా పెరిగిన విద్యుత్‌ వినియోగం

ఫ 200 యూనిట్లు దాటితే వర్తించని గృహజ్యోతి పథకం

ఫ చిట్కాలు పాటిస్తే విద్యుత్‌ బిల్లు భారం నుంచి

గట్టెక్కే అవకాశం

విద్యుత్‌ వినియోగం అంచనా..

పరికరం సామర్థ్యం వినియోగం ఖర్చయ్యే విద్యుత్‌

(వాట్స్‌) (రోజుకు గంటలు) (నెలకు యూనిట్లు)

ఎల్‌ఈడీ బల్బు 40 10 01

ఫ్యాన్‌ 60 15 27

బోరు మోటారు 300 01 21

టీవీ 100 05 15

వాషింగ్‌ మిషన్‌ 300 02 18

ఏసీ 1500 02 90

వాటర్‌ హీటర్‌ 3000 01 12

మిక్సర్‌ గ్రైండర్‌ 450 01 13.25

No comments yet. Be the first to comment!
Add a comment
ఆదా చేస్తేనే ‘గృహజ్యోతి’1
1/1

ఆదా చేస్తేనే ‘గృహజ్యోతి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement