బాధితులకు సత్వర న్యాయం జరగాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కమిషన్ సభ్యులతో కలిసి నిర్వహించిన సమీక్షలో చైర్మన్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములపై ఉన్న కేసులను పరిష్కరించాలన్నారు. పీఎం అజయ్ పథకం కింద లబ్ధిదారులను త్వరగా ఎంపిక చేసి వారి బోర్ల ద్వారా సాగునీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల జిల్లాలో పరువు హత్యకు గురైన మాల బంటి అలియాస్ కృష్ణ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూడాలన్నారు. ఈ కేసు విషయంలో కలెక్టర్ బాగా పనిచేస్తున్నట్లు తెలిపారు. దళిత బంధు రాని అర్హులైన ఎనిమిది కుటుంబాలకు వెంటనే అందేలా చూడాలన్నారు.
ప్రతినెలా పౌరహక్కుల దినోత్సవం జరపాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతినెలా చివరి రోజున కచ్చితంగా పౌర హక్కుల దినోత్సవం జరిగేలా చూడాలన్నారు. అంతకుముందు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లాలో అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, సంక్షేమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్ చైర్మన్‌కు వివరించారు. మాల బంటి కేసును వివరిస్తూ భార్గవి విద్యార్హత మేరకు సర్టిఫికెట్ పరిశీలించి ఉద్యోగం కల్పిస్తామని, కేసారంలో డబుల్‌బెడ్‌రూం ఇల్లు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే పోలీస్ భద్రతతో పాటు వారి ఇంటి వద్ద 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కె.నరసింహ, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, శంకర్, నీలాదేవి, లక్ష్మీనారాయణ, ఎస్సీ అభివృద్ధి అధికారి లత, ఎస్టీ అభివృద్ధి అధికారి శంకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్‌నాయక్, ఎల్‌డీఎం బాపూజీ, జీఎం సీతారాం నాయక్, డీఎస్పీలు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
బాధితులకు సత్వర న్యాయం జరగాలి
Comments
Please login to add a commentAdd a comment