వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలి
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
పెన్‌పహాడ్: రబీలో రైతులు నీటి కొరతను అధిగమించేందుకు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన బొబ్బెర్లు, ఉలవలు వేసుకోవాలని, ఈ దిశగా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. పెన్‌పహాడ్ మండల పరిధిలోని ధర్మాపురం, మేగ్యాతండా, భక్తాళాపురం గ్రామాల్లో ఎస్సార్‌ఎసీ కాల్వ ద్వారా సాగు చేస్తున్న వరి పొలాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. సాగునీటి లభ్యత, బోరు, బావుల ద్వారా ఎంత మేర సాగు అవుతుందో క్షేత్రస్థాయిలో తిరిగిచూశారు. బోరుబావుల్లో నీరు సరిపోతుందా, ఇంకా ఎన్ని రోజులు నీరు సరఫరా చేస్తే పంటలు చేతికి వస్తుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. 20రోజులు కాల్వల ద్వారా సాగునీరు వచ్చేలా చూస్తే బోరుబావుల్లో నీరు ఉంటుందని పంటలు కూడా చేతికి వస్తాయని రైతులు తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ లాలు, ఇరిగేషన్ ఏఈ లింగయ్య, ఏఓ అనిల్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment