కేసీఆర్‌కు పేరు వస్తుందని నీళ్లు ఇవ్వడం లేదు
సూర్యాపేటటౌన్ : ‘కాళేశ్వరం ఒక పిల్లర్ కూలితే దాన్ని రిపేరు చేయించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. కానీ బాగు చేయిస్తే కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందోనని దుర్బుద్ధతితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వకుండా రైతుల పంట పొలాలను ఎండబెడుతున్నాడు’ అని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు కుదేలయ్యాయని, ముఖ్యంగా వ్యవసాయం పూర్తిగా నష్టాల్లో ఉందన్నారు. రాష్ట్రంలో నీళ్లు లేక లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయని, జిల్లాలో ఎస్సారెస్పీ కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో పంటలు పండక పశువులను మేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు నీళ్లు ఇవ్వాలని, లేకుంటే పంట నష్టం అంచనా వేసి పరిహారం ఎకరానికి రూ.30,000 అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఆకుల లవకుశ, జీడి భిక్షం, తూడి నరసింహారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment