
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
భానుపురి : హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని, ఎస్సారెస్పీ పరిధిలో ఎండిపోయిన వరి పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకొనిపోయేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ వెంటనే రావాలని సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. అనంతరం వినతి పత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి