
సాక్షి, చైన్నె : లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా మక్కల్ నీది మయ్యం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ పార్టీ నేత, విశ్వనటుడు కమలహాసన్ ఆదేశాల మేరకు ద్వితీయ శ్రేణి నేతలు జిల్లాల వారీగా సమాచార సేకరణకు చర్యలు చేపట్టారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే– కాంగ్రెస్ కూటమితో కలిసి ఎన్నికలను ఎదుర్కొనేందుకు కమల్ సిద్ధమవుతున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆయన కార్యక్రమాలు గత కొంత కాలంగా ఉంటున్నాయి. ఎన్నికలలోపు పార్టీ బూత్ కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు విస్తృతం చేయడానికి సిద్ధమయ్యారు.
ఇందుకోసం ద్వితీయ శ్రేణి నేతల ద్వారా జిల్లాల కార్యదర్శుల సమావేశానికి నిర్ణయించారు. ఆ మేరకు ఆదివారం ఉదయం నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఆళ్వార్ పేటలోని పార్టీ కార్యాలయంలో 16 జిల్లాల కార్యదర్శులతో పార్టీ రాష్ట్ర కమిటీలోని ముఖ్య నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు సమావేశమయ్యారు. చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం తదితర జిల్లాలతో పాటు, ఉత్తర, ఽమధ్య, దక్షిణ చైన్నె, శ్రీపెరంబదూరు లోక్ సభ నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా నియోజకర్గాలలో పార్టీ పరిస్థితి, బూత్‌కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదుతో పాటు విస్తృతంగా చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలను ఈసందర్భంగా జిల్లాల కార్యదర్శులకు ముఖ్య నేతలు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment