తమిళసినిమా: నటి కృతి శెట్టి మరో లక్కీఛాన్స్ వరించిందని తాజా సమాచారం. తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా వున్న ఈ బ్యూటీకి ఇప్పటికే ది వారియర్ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయినా కృతిశెట్టికి అక్కడ అవకాశాలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం నాగచైతన్య జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రంలో ఆమె నటిస్తోంది.
తాజాగా నటుడు జయం రవికు జంటగా నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. పొన్నియిన్ సెల్వన్ చిత్రం విజయంతో మంచి జోష్‌లో ఉన్న జయంరవికి ఆ తరువాత విడుదలైన అఖిలన్ చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం సైరన్ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు ఇరైవన్ అనే చిత్రం ఆయన చేతిలో ఉంది. కాగా తాజాగా మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనిని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా భువనేశ్వర్ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నారు.
చిత్రం జూన్ నెలలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అదే విధంగా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఇందులో జయం రవికు జంటగా నటి కృతి శెట్టిని నటింపచేయడానికి యూనిట్ వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. కాగా దీనికి జీవీ అనే టైటిల్‌ను ఖరారు చేశారని తెలిసింది.
జయం రవికి జోడీగా కృతిశెట్టి?
Published Fri, Apr 7 2023 1:26 AM | Last Updated on Sat, Apr 8 2023 1:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment