భక్తిగీతాలను ఆలపిస్తున్న మహిళలు
కొరుక్కుపేట: రాష్ట్రంలో ఈస్టర్ పండగను క్రైస్తవులు ఆదివారం కోలాహలంగా జరుపుకున్నారు. ప్రదానంగా నాగపట్నం వేలాంగణి చర్చిలో ఈస్టర్ పండుగ సంబరాలు మిన్నంటాయి. చైన్నె అంతటా ఈస్టర్ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా క్రైస్తవులు ఈస్టర్‌ను యేసుక్రీస్తు పునరుత్థానంగా భావించి జరుపుకుంటారు. వెస్లీ టెంపుల్, కేథడ్రల్ టెంపుల్, శాంతోమ్, బీసెంట్ నగర్ వెలాంగణి చర్చ్, పెరంబూర్ మేరీ మాత ఆలయం సహా పలు చర్చీలలో ఆదివారం వేకువజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు, భక్తి గీతాలాపనలు జరిగాయి.
వెపేరిలో....
తెలుగు క్రైస్తవుల ప్రదానంగా చైన్నె వేప్పేరిలోని మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్టు సంఘంలో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో ప్రత్యేక పార్థనలు చేపట్టారు. ఇందులో సంఘ అధ్యక్షులు జి రామయ్య, సెక్రటరీ పి.ప్రభుదాసు, ట్రెజరర్ ఏ బాబు లు ఏర్పాట్లును పర్యవేక్షించారు.
విల్లివాక్కంలో...
అలాగే చైన్నె విల్లివాక్కంలోని యేసు క్రీస్తు కృపా నీరీక్షణ ప్రార్థన ఫౌండేషన్ చర్చిలో ఈస్టర్‌ను ఘనంగా జరుపుకోగా ఫౌండేషన్ అధ్యక్షులు ఊటూకూరి దేవదానం , సెక్రటరీ సామ్యూల్, ట్రేజరర్ ఊటుకూరి మత్తయ్య, ఫాస్టర్ మాణిక్య రావు, అసిస్టెంట్ పాస్టర్ ఎస్‌ఆర్ మరియదాస్ పాల్గొని ఈస్టర్ సందేశాన్ని వినిపించారు .40 రోజులు పాటు ఉపవాస ప్రార్థనల్లో పాల్గొన్న మహిళలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. యేసుక్రీస్తు సందేశం, దీపాలు ఆర్పివేసి ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని ప్రజలకు కళ్లకట్టినట్టు చూపించారు. ఈ సందర్భంగా బాణాసంచా పేలుస్తూ కేక్‌లు కట్ చేశారు. అనంతరం అభిషేకం చేసిన పవిత్ర జలాన్ని క్రైస్తవులపై చల్లి ఆశీర్వదించారు.
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలలో క్రైస్తవ సోదరులు ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గత 40 రోజులుగా ఉపవాసం ఉంటూ ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మార్చి 30న మట్టల పండుగ జరిగింది. గత శుక్రవారం ఏసు ప్రభువును శిలువ వేసిన రోజు కావడంతో గుడ్‌ఫ్రైడేగా జరుపుకొని ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఏసు ప్రభువు సమాధి నుంచి తిరిగొచ్చిన దినంగా భావించి ప్రతి చర్చిలోనూ వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా ఆదివారం ఉదయం ప్రతి చర్చిలోనూ పుష్పాలతో అలంకరించి ఉదయం నుంచి ఈస్టర్ పండు వేడుకలను జరుపుకొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ప్రతి చర్చిలోనూ క్రైస్తవ సోదరులతో కిటకిటలాడింది. వేలూరు సెంట్రల్ చర్చిలో సీఎస్‌ఐ బిషప్ శర్మా నిత్యానందం అధ్యక్షతన ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment