విజయ్ ప్రసంగం (ఫైల్)
డీఎంకే కూటమిలో చర్చ
వీసీకే ‘గళం’ బలం
కాంగ్రెస్ వాటా లేఖాస్త్రం
అది బీజేపీ బీ, సీ టీం అన్న డీఎంకే
కూటమి బలంగా ఉందని స్టాలిన్ వ్యాఖ్య
విక్రవాండి మహానాడు వేదికగా తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ చేసిన సంకీర్ణ ప్రభుత్వం, అధికారంలో వాటా ప్రకటన డీఎంకే కూటమిలో కొత్త చర్చకు దారి తీసింది. ఈ కూటమిలోని వీసీకే తమ గళానికి బలం చేకూరినట్టయ్యిందన్న వ్యాఖ్యలు తూటాలను పేల్చింది. అధికారంలో వాటా పై నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శరవణన్ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు లేఖాస్త్రం సందించడం గమనార్హం. అదే సమయంలో డీఎంకే కూటమి బలంగా ఉందని, 200 స్థానాలలో గెలుపు లక్ష్యంగా పనుల వేగం పెంచాలని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు స్టాలిన్ పిలుపు నిచ్చారు.
సాక్షి, చైన్నె: విల్లుపురం జిల్లా, విక్రవాండి వీసాలై గ్రామంలో ఆదివారం జరిగిన తమ పార్టీ తొలి మహానాడు బ్రహ్మాండ విజయవంతం కావడంతో తమిళగ వెట్రికళగం వర్గాలు మంచిజోష్ మీదున్నాయి. పది లక్షల మందికి పైగా ఈ మహానాడుకు తరలి వచ్చినట్టు భావిస్తున్నారు. ఇందులో విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట హాట్ టాపీగా మారాయి. ఏ చానళ్లు చూసినా విజయ్ వ్యాఖ్యలపై డిబెట్ల హోరు పెంచాయి. ప్రధానంగా అవినీతి, అక్రమాలంటూ రాష్ట్రంలో డీఎంకేను, మతతత్వ శక్తి పేరిట కేంద్రంలో బీజేపీని విజయ్ టార్గెట్ చేసినా తాము గెలిస్తే.. సంకీర్ణ ప్రభుత్వం.. మిత్రులకు అధికారంలో వాటా అన్న ప్రకటన రాష్ట్రంలో పెను చర్చకు దారితీసింది. ఇన్నాళ్లు రాష్ట్రంలో కూటమిగా ఎన్నికలను ఎదుర్కొన్నా, అధికారం విషయానికి వస్తే డీఎంకే , అన్నాడీఎంకేలు మార్చిమార్చి చేజిక్కించకుంటూ వచ్చాయి. ఆ పార్టీలకు చెందిన వారే మంత్రులుగా రాజ్యమేలుతుండే వారు. కూ టమి పార్టీలు మి త్ర పక్షాలుగా రా జకీయం సాగించాల్సిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా విజయ్ కూటమి, వాటా అంటూ సంకీర్ణ ప్రభు త్వం అధికారంలో కి రావాల్సిన అవశ్యం ఉందన్న వ్యాఖ్యలు అందుకోవడంతో డీఎంకే, అన్నాడీఎంకే గొడుగు నీడన చేరే పార్టీలను ఆలోచనలో పడేశాయి. అదే సమయంలో రాష్ట్రంలోని పార్టీలను తన వైపు తిప్పుకునేందుకే విజయ్ ఈ కొత్త ప్రకటన అందుకున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎవరేమంటున్నారంటే?
ఇటీవల కాలంగా డీఎంకే కూటమిలోని వీసీకే అధికారంలో వాటా అన్న నినాదాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్ వ్యాఖ్యలను ఆ పార్టీ తీవ్రంగానే పరిశీలిస్తున్నట్టుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ పార్టీ నేత అర్జున్ సోమవారం స్పందించారు. తమ గళానికి బలం చేకూరిందని వ్యాఖ్యలు చేశారు. తమ గళం మున్ముందు మరింతగా జ్వలిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత రవికుమార్ స్పందిస్తూ అంబేడ్కర్ భగవద్గీత గురించి రాసిన విషయాలను కూడా విజయ్ చదవాలని సూచించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై స్పందిస్తూ ప్రస్తుతం కూటమిలో ఎలాంటి మార్పు లేదంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శరవణన్ డీఎంకే అధ్యక్షు డు, సీఎం స్టాలి న్‌కు ఓ లేఖ రాయడం చ ర్చకు దారితీ సింది. ఇప్పు డే అధికారంలో వాటాపై నిర్ణయం తీసుకుని భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండాలని అందులో సూచించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ సీనియర్‌నేత, ఎంపీ మాణిక్యంఠాకూర్ స్పందిస్తూ కూటమి పాలన నినాదం బాగుందంటూ విజయ్‌పేరు ప్రస్తావన లేకుండా వ్యాఖ్యలు చేశారు.
డీసెంట్ పెర్ఫామెన్స్
అన్నాడీఎంకే దివంగత నేత ఎంజీఆర్ పేరు మహానాడులో ప్రస్తావించిన విజయ్, ఆ పార్టీని టార్గెట్ చేయకపోవడం మరో చర్చకు దారితీసింది. అస్సలు అన్నాడీఎంకేను ఆయన లెక్కలోకి తీసుకోలేదన్న చర్చ ఊపందుకుంది. ఈ విషయంగా అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ స్పందిస్తూ, విజయ్ సిద్ధాంతాలలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారని, అన్ని పార్టీల సిద్ధాంతాలలో తలా ఓ ముక్క తీసుకుని కాక్ టైల్ ఐడియాలజీని ఉపయోగించారని ఎద్దేవా చేశారు. నోటి మాట, రాతపూర్వకంగా అమలయ్యేనా అన్నది కాలం సమాధానం చెబుతుందన్నారు. మరో నేత ఆర్‌బీ ఉదయకుమార్ స్పందిస్తూ, ద్రావిడ మోడల్‌కు వ్యతిరేకంగా ఆయన గళం వినిపించి ఉన్నారని, ఇదే కాద తాము కూడా ఆది నుంచి చేస్తూ వస్తున్నదని వ్యాఖ్యలు చేశారు.
బీ, సీ టీం
విజయ్ తమను టార్గెట్ చేయడంపై డీఎంకే నేతలు తీవ్రంగానే స్పందించారు. స్పీకర్ అప్పావు మాట్లాడుతూ, రజనీకాంత్ రాజకీయాలలో యూ టర్న్ తీసుకోవడంతో విజయ్‌ను బీజేపీ తెర మీదకు తెచ్చినట్టుందని ఆరోపించారు. ఇది బీజేబీ బీటీం అన్నది స్పష్టమవుతోందన్నారు. మంత్రి రఘుపతి స్పందిస్తూ, పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు అని, ఇప్పటికే అనేక మంది నాయకులు ఉదాహరణకు శరత్‌కుమార్, కమల్, కరుణాస్.. ఇలా చెప్పకుంటూ పోతే ఎందరో పార్టీని పెట్టారని వివరించారు. అయితే, డీఎంకే నీడను కూడా ఎవ్వరూ తాకలేక పోయారని హితవు పలికారు. మరో మంత్రి శేఖర్‌బాబు స్పందిస్తూ, డీఎంకే అనే మహాశక్తిని కొత్తగా ఏ శక్తీ నిలువరించ లేదన్నారు. ఎంపీ తమిళచ్చి తంగ పాండియన్ పేర్కొంటూ డీఎంకేను నిర్వీర్యంచేయాడం లేదా ఉదయ సూర్యడ్ని తాకేందుకు ఎవ్వరూ సాహసం చేయలేరని, చేయబోరని హితవు పలికారు. ఈ చర్చల నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.
బలంగానే కూటమి
పార్టీ కార్యాలయంలో స్టాలిన్ అధ్యక్షతన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పర్యవేక్షకుల సమావేశం జరిగింది. ఇందులో స్టాలిన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో వందకు వంద గెలిచామన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఇక అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఇందులోనే గెలుపు మనదేనని ధీమా వ్యక్తం చేశారు. 200 స్థానాలలో గెలుపు లక్ష్యంగా ఇప్పటి నుంచి కార్యక్రమాలు విస్తృతం చేయాలని ఆదేశించారు. దేశంలో ఈ పార్టీ ప్రభుత్వం అమలు చేయని పథకాలను రాష్ట్రంలో విజయవంతంగా ప్రజలకు దరి చేర్చామని వివరించారు. పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజలతో మమేకం అయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల పనులు వేగవంతంచేయాలని, గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆదేశించడం గమనార్హం.
ఎవరికి నష్టం
విజయ్ ప్రకటన నేపథ్యంలో నష్టం తీవ్రత రాష్ట్రంలో ఎవరికి ఎక్కువగా ఉండబోతున్నదో అన్న చర్చ ఊపందుకుంది. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలతో పాటుగా వామపక్షాలు, కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌లు చీలుతాయన్న ప్రచారం ఊపందుకుంది. దివంగత నేతల ఎంజీఆర్, జయలలితల తరహా రాజకీయాన్ని విజయ్ సాగించబోతున్నట్టుగా, అధికారంలో వాటా అన్న నినాదంతో రాష్ట్రంలో 2026లో బలమైన కూటమి ఏర్పాటు చేసి తీరుతారన్న ధీమాను రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నాయి. ఇన్నాళ్లు, డీఎంకే, అన్నాడీఎంకేల గొడుగు నీడన చేరి ఎన్నికలను ఎదుర్కొనే అనేక పార్టీలు అధికార బలం కోసం విజయ్ వైపుగా దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు. బలమైన కూటమి ఏర్పాటులో సఫలీకృతులైన పక్షంలో తొలి నష్టం డీఎంకేకు, ఆ తదుపరి అన్నాడీఎంకేకు తప్పదని పేర్కొంటుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment