అన్నానగర్: అరియలూరు సమీపంలో మద్యం మత్తులో ఉన్న భర్త మర్మాంగాన్ని కోసి భార్య దారుణంగా హతమార్చింది. అరియలూరు జిల్లా, సెందురై సమీపంలోని ఆనందవాడి గ్రామానికి చెందిన చిన్నప్ప(45)రైతు. ఇతని భార్య పచ్చయమ్మాళ్ (43). వీరికి కుమారుడు బాలమురుగన్ (23), కుమార్తె భానుప్రియ (21) ఉన్నారు. బాలమురుగన్ సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. భానుప్రియ వివాహం జరిగి భర్తతో అరియలూరు సమీపంలోని తామరైకులం గ్రామంలో ఉంటోంది. చిన్నప్ప రోజూ మద్యం తాగి వచ్చి పచ్చాయమ్మాళ్‌ను వేధించేవాడని తెలిసింది. రెండు రోజుల క్రితం భానుప్రియ పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి చిన్నప్ప మద్యం మత్తులో ఇంటికి పచ్చయమ్మాళ్, భానుప్రియతో గొడవ పడ్డాడు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి సమీపంలోని ఓ ఇంట్లో అమ్మ, కుమార్తె బస చేశారు. బుధవారం తెల్లవారుజామున చిన్నప్ప రక్తపు మడుగులో చేతులు, కాళ్ల నరాలు, మర్మాంగం కోతకు గురై శవమై పడి ఉన్నాడు. అనంతరం మద్యం మత్తులో చిన్నప్ప తనే చేతులు, కాళ్లు, ప్రైవేట్ భాగాలు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పచ్చయమ్మాళ్ బంధువులను నమ్మించింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం పచ్చయమ్మాళ్‌ను విచారించారు. విచారణలో పచ్చయమ్మాళ్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు.. నా భర్త మద్యం తాగి తరచూ నన్ను ఇబ్బంది పెట్టేవాడు. మంగళవారం రాత్రి నన్ను, నా కూతురుని దుర్భాషలాడాడు. అతనికి భయపడి మేమిద్దరం ఇరుగుపొరుగు ఇళ్లల్లో తలదాచుకున్నాం. తెల్లవారుజామున 3 గంటలకు మా ఇంటికి వెళ్లాను. ఇనుప పైపుతో చిన్నప్ప తలపై కొట్టాను. బతికితే నన్ను చంపేస్తాడనే భయంతో ఇంట్లో కూరలు కోసే కత్తితో చేతులు, కాళ్లు, మర్మాంగాన్ని నరికేశానని పోలీసులకు తెలిపింది. పోలీసులు పచ్చయమ్మాళ్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment