వ్యాపారి ఇంటిపై పెట్రో బాంబుతో దాడి
● ఏడుగురి ముఠా కోసం గాలింపు
సేలం: తిరునెల్వేలి జిల్లా పాప్పరకుడి సమీపంలో ఉన్న పల్లక్కాల్ పొదుకుడి అనే ప్రాంతానికి చెందిన వ్యాపారి మైదీన్ (52). ఆయన మంగళవారం రాత్రి ఇంటిలో కుటుంబంతో ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో రెండు బైక్‌లలో అక్కడికి వచ్చిన గుర్తుతెలియని ఏడుగురు వ్యక్తులతో కూడి ముఠా మైదీన్‌ను పిలిచారు. అయితే ఇంటిలో లోపలే ఉన్న మైదీన్ బయటకు రాలేదు. అప్పుడు ఆ ముఠా మారణాయుధాలతో ఇంటి ముందు ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. ఆ మార్గంలో వచ్చిన హోటల్ కార్మికుడు మసూది (58)ను పిలిచి ఆ ముఠా అతనితో కూడా మైదీన్‌ను పిలిచి తలుపులు తెరవని చెప్పారు. అయినా మైదీన్ ఇంటి లోపలే ఉండిపోయాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన ఆ ముఠా మసూదిపై దాడి చేసింది. తర్వాత వారు ఆ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుల దాడిలో గాయపడిన మసూదిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు అక్కడ ఉన్న నిఘా కెమెరాల ఆధారంగా, మైదీన్ ఇచ్చిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment