తిరువొత్తియూరు: గూడువాంజేరి సమీపంలో కారును చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గూడువాంజేరి సమీపం ఒల్లంజేరికి చెందిన ఫ్రాంక్లిన్ కాల్ టాక్సీ డ్రైవర్. ఇతను మంగళవారం రాత్రి ఇంటి ముందు కారు నిలిపి ఉంచాడు. ఉదయం లేచి చూడగా కారు కనబడలేదు. దీంతో గుడివాంజేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారులో జీపీఎస్ పరికరం ఉన్న సంగతి తెలియకుండా గుర్తు తెలియని వ్యక్తి కారును చోరీ చేసి తీసుకువెళ్లాడు. తనిఖీలో అచ్చరపాకం సమీపంలో కారు ఉన్నట్లు తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లి పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. దానిని చోరీ చేసిన తిరువారూర్ జిల్లాకు చెందిన పెరుమయ్యన్ (30) అనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment