సాక్షి, చైన్నె: ఎంఆర్‌ఎం గ్లోబల్ హాస్పిటల్స్ దేశంలోని తొలి సారిగా హార్ట్ కేవిటీ లంప్‌కి కీహోల్ సర్జరీతో విజయవంతంగా చికిత్సను నిర్వహించారు. పుదుచ్చేరికి చెందిన 50 ఏళ్ల మహిళకు ఈ శస్త్ర చికిత్స జరిగింది. గుండె చుట్టూ రెండు పొరలుగా ఉండే పెరికార్డియం లోపల తిత్తి, గడ్డకు చికిత్స పొందిన తొలి రోగి ఈమె అని వైద్యులు పేర్కొన్నారు. ఈ కీహోల్ సర్జరీ విజయవంతంగా గురించి కార్డియోథొరాసిక్ సర్జరీలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సుజిత్ వేలాయుధన్ ఇందిర నేతృ త్వంలోని వైద్య బృందంలో కార్డియాక్ అనస్థటిస్ట్ డాక్టర్ శ్రీనాథ్, కార్డియోథొరాసిక్ సర్జరీలో అసిస్టెంట్ కన్సల్టెంట్ డాక్టర్ బి. నెంబియన్ రాజ రాజన్, పల్మోనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వీ సింధు లు బుధవారం స్థానికంగా వివరించారు. ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణన్ మాట్లాడుతూ, ఈ అరుదైన కేసులో పెరికార్డియల్ కుహరంలోని తిత్తులు చాలా అసాధారణమైనవి అని పేర్కొన్నారు. వైద్య సాహిత్యంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కేసులు మాత్రమే ఇలాంటివి నమోదు చేయబడ్డాయన్నారు. ఇది సాధారణంగా గుండె, ఊపిరితిత్తుల పనితీరును తాత్కాలికంగా నిలిపివేయడం అవసరం అని పేర్కొంటూ, ఆధునిక విధానంతో వైద్య నైపుణ్యంతో ఓ మైలురాయిని గుర్తించామన్నారు. డాక్టర్ సుజిత్ వేలాయుధన్ ఇందిర మాట్లాడుతూ, పుదుచ్చేరికి చెందిన 50 ఏళ్ల మహిళ చాలా వారాలుగా నిరంతర దగ్గు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని అనుభవిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఆసుపత్రిలో స్కాన్ చేయగా ఆమె ఛాతీలో పెద్ద తిత్తి గుండె ఎడమ కర్ణికకు వ్యతిరేకంగా నొక్కుతుండటాన్ని గుర్తించామన్నారు. ప్రమాదకరంగా ప్రధాన రక్త నాళాలు, ఎడమ కర్ణిక మరియు పల్మనరీ సిరలకు దగ్గరగా ఉందని నిర్ధారించామన్నారు. వైద్య బృందం సమష్టిగా ఆధునిక విధానం అనుసరించి ఈ శస్త్రచికిత్సతో రోగికి పునర్జన్మను కల్పించినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment