● అళగిరి మద్దతుదారుల ఎదురు చూపు
సాక్షి, చైన్నె: తమను క్షమించి మళ్లీ పార్టీలోకి తీసుకుంటారా? అన్న ఎదురు చూపులలో డీఎంకే బష్కృత నేత అళగిరి మద్దతుదారులు ఎదురు చూస్తున్నారు. గతంలో డీఎంకేకు వ్యతిరేకంగా వ్యవహించారనే నెపంతో తన పెద్దకుమారుడు అళగిరిని పార్టీ నుంచి దివంగత డీఎంకే అధినేత కరుణానిధి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు తొమ్మిది మంది మద్దతుదారులైన ముఖ్యనేతలను కూడా బయటకు పంపించారు. ప్రస్తుతం కరుణానిధి జీవించి లేరు. పార్టీ అధ్యక్షుడు, సీఎంగా స్టాలిన్ ఉన్నారు. స్టాలిన్‌కు తన సోదరుడితో ఉన్న వైర్యం తగ్గినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు ఇటీవల కాలంగా చోటు చేసుకున్నాయి. దీంతో తమను క్షమించి డీఎంకేలోకి తీసుకోవాలని కోరుతూ అళగిరి మద్దతు నేతలు మన్నన్, గోపీనాథన్, ఉదయకుమార్, ముబారక్, అన్బరసన్, రాజేంద్రన్, ఇసక్కిముత్తు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌కు విజ్ఞప్తి లేఖను పంపించి ఉండటం బుధవారం వెలుగులోకి వచ్చింది. వీరి క్షమాపణను మన్నించి పార్టీలోకి స్టాలిన్ వారిని ఆహ్వానించేనా అనే చర్చ జోరందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment