● మంత్రి శేఖర్ బాబు
కొరుక్కుపేట: ఆనైమలై మాసానియమ్మన్ ఆలయానికి విరాళంగా వచ్చిన 28 కిలోల 906 గ్రాముల బంగారాన్ని రిటైర్డ్ కోర్టు జడ్జి దురైసామి సమక్షంలో హిందూ ధార్మిక శాఖ మంత్రి శేఖర్‌బాబు కరిగించి, బంగారు బాండ్‌లో పెట్టుబడి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొల్లాచ్చి బ్రాంచ్ మేనేజర్‌కు అందజేశారు. ఆ తర్వాత భక్తుల వినియోగానికి పొల్లాచ్చి ఫెడరల్ బ్యాంక్ తరపున రూ.6 లక్షల విలువైన బ్యాటరీ వాహనాన్ని ఆలయ పాలకమండలికి అందజేశారు. ఆనైమలై ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో హిందూ ధార్మిక శాఖ అదనపు కమిషనర్ సుకుమార్, పొల్లాచ్చి సబ్ కలెక్టర్ క్యాథరిన్ శరణ్య, జాయింట్ కమిషనర్లు వనమతి,ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ధర్మకర్తలు తంగమణి, మంజుల దేవి, ఆనైమలై మున్సిపాలిటీ చైర్మన్ కలైచెల్లి శాంతలింగ కుమార్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. ఆనైమలై కార్యక్రమాన్ని ముగించుకుని మంత్రి శేఖర్‌బాబు కోయంబత్తూరు బయల్దేరి వెళ్లారు. పేరూరులోని పట్టీశ్వర ఆలయానికి మంత్రి శేఖర్‌బాబు చేరుకునిస్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి శేఖర్‌బాబు మరుదామలై మురూరు ఆలయానికి వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment