క్లుప్తంగా
28న నూతన
సంవత్సర సమావేశం
● డాక్టర్ అన్బుమణి
రామదాస్ ప్రకటన
కొరుక్కుపేట: పీఎంకే పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న నూతన సంవత్సర వేడుకల సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రామదాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ నూతన సంవత్సర ప్రత్యేక జనరల్ కమిటీ సమావేశంలో 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఈనెల 28న వెల్ కమ్ డే 2025్ఙ పేరుతో వేడుకలు నిర్వహించబడుతాయన్నారు. 28వ తేదీశనివారం ఉదయం 10 గంటలకు పుదుచ్చేరి నవర్కులం హైవేలోని టోల్ బూత్ సమీపంలోని సంగమిత్ర కల్యాణ మండపంలో నూతన సంవత్సర జనరల్ కమిటీ సమావేశం జరుగుతుందని పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామదాస్ సమక్షంలో జరిగే ప్రత్యేక జనరల్ కమిటీ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రామదాస్ అధ్యక్షత వహిస్తారు. పార్టీ గౌరవాధ్యక్షుడు జి.కె. మణి, ప్రధాన కార్యదర్శి వడివేల్ రావణన్ తదితరులు సమావేశంలో పాల్గొంటారని వెల్లడించారు.
గంజాయిని
సీజ్ చేసిన కోస్టుగార్డు
సాక్షి, చైన్నె: ఇండియన్‌కోస్టుగార్డు మండపం వర్గాలు బుధవారం యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్‌ను సముద్రంలో నిర్వహించారు. ఇండో – శ్రీలంకన్ సమీపంలో నిఘా వేశారు. ఏసీవీ ఐఎంబీఎల్ సమీపంలోని ఐలాండ్‌లో కొన్ని ప్యాకెట్లను గుర్తించారు. వాటిని పరిశీలించగా గంజాయిగా తేలింది. 10 బస్తాలతో ఉన్న ఈ గంజాయి బరువు 22 కేజీలుగా గుర్తించారు. దీనిని రామనాథపురం జిల్లా రామేశ్వరం కస్టమ్స్ విభాగానికి అప్పగించారు.
చిరుత దాడిలో యువతి మృతి
వేలూరు: వేలూరు జిల్లా కె.వి. కుప్పం సమీపంలోని తురవం గ్రామంలో చిరుత దాడిలో యువతి మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పూర్వం గ్రామానికి చెందిన అంజలి(23) కళాశాల విద్యను పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. బుధవారం సాయంత్రం ఇంటి సమీపంలోని వ్యవసాయ భూమి వద్దకు వెళ్లింది. అయితే చాలా సమయం అయినప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. వ్యవసాయ పొలం వద్ద రక్తపు మడుగులో మృతి చెంది ఉండడానికి గమనించి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరపగా చిరుత దాడిలో మరణించినట్లు తేలింది.
భార్య హత్య కేసులో
భర్తకు జీవిత ఖైదు
అన్నానగర్: భార్యను హత్య చేసిన ఓ వ్యక్తికి చెంగల్పట్టు కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. చైన్నెలోని పల్లికరణై భారతిదాసన్ మొదటి వీధికి చెందిన కృష్ణమూర్తి (48). ఇతని భార్య మహాలక్ష్మి అలియాస్ జోసెఫిన్ మేరీ(40). వీరికి ఇద్దరు కొడుకులు. కృష్ణమూర్తి చైన్నె వేలచ్చేరిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా పనికి వెళ్లకుండా రోజూ మద్యం సేవిస్తున్నాడు. కృష్ణమూర్తి భార్య మహాలక్ష్మి ఇతర ఇళ్లలో పాచి పనులు చేసుకుంటోంది. అయితే ఎందుకు రోజూ ఆలస్యంగా వస్తున్నావని వాధించేవాడు. భార్య దగ్గర డబ్బులు తీసుకుని మద్యం తాగేవాడు. ఈ పరిస్థితిలో 2018లో మద్యం సేవించిన కృష్ణమూర్తి తన భార్య మహాలక్ష్మి తీరుపై అనుమానం వచ్చి ఇంట్లోని కూరగాయలు కోసే కత్తిని తీసుకుని ఆమె మెడపై పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కృష్ణమూర్తి కుమారుడు గునాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పల్లికరణై పోలీసులు కృష్ణమూర్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు చెంగల్‌పట్టు మహిళా కోర్టులో విచారణకు రాగా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శశిరేఖ హాజరయ్యారు. బుధవారం కేసును విచారించిన న్యాయమూర్తి ఎళిలరసి కృష్ణమూర్తికి జీవిత ఖైదు, రూ.6 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
విద్యుదాఘాతంతో
కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి
సేలం: విద్యుదాఘాతానికి గురై కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. వివరాలు.. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో ఉన్న కల్లుపట్టికి చెందిన వ్యక్తి కలామణి (45). అదే ప్రాంతంలో అరుణంపట్టికి చెందిన వ్యక్తి మాణిక్యం (32). వీరిద్దరు తిరుచ్చి కేకేనగర్‌లో ఉన్న విద్యుత్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. తిరుచ్చి ఓలయూర్ సింగ్ రోడ్డు సమీపంలో ఒక పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆ పెట్రోల్ బంకుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం కోసం కలామణి, మాణిక్యం పనిచేస్తుండగా.. షాక్‌తో మరణించారు. కలామణికి గాయాలు కాగా మాణిక్యం ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment