ఆయన ప్రభావం నాపై పడింది
తమిళ సినిమా: మలయాళంలో స్టార్ హీరోయిన్ అయిన మంజు వారియర్ నటుడు దిలీప్ నుంచి విడాకులు పొందిన తరువాత తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్నారని చెప్పవచ్చు. ఆ మధ్య నటుడు ధనుష్ కు జంటగా అసురన్ చిత్రంలో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అదేవిధంగా నటుడు అజిత్ జంటగా తుణివు చిత్రంలో యాక్షన్ హీరోయిన్గా నటించి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల రజనీకాంత్‌కు భార్యగా వేట్టయ్యన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా విజయ్ సేతుపతి సరసన నటించిన విడుదలై –2 చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఇది ఇంతకుముందు వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదలై చిత్రానికి సీక్వెల్ అన్నది గమనార్హం. ఆర్‌ఎస్ ఇన్ఫోటెయిన్‌మెంట్ పతాకంపై కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు విజయ్ సేతుపతి, సూరి, నటి మంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో ప్రకాష్ రాజ్, చేతన్, నటి భవానిశ్రీ, దర్శకుడు గౌతమ్ మీనన్, బాలాజీ శక్తి వెల్, రాజీవ్ మీనన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా విడుదలై–2 చిత్ర టీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నటి మంజు వారియర్ ఒక భేటిల్లో పేర్కొంటూ నటుడు అజిత్ తన జీవితంపై చాలా ప్రభావం చూపారన్నారు. ఆయన మాట్లాడుతుంటే వింటూనే ఉండాలనిపిస్తుందని అంత చక్కగా మాట్లాడుతారని పేర్కొన్నారు. తనకు మోటర్ బైక్ నడపాలన్నది చిన్ననాటి నుంచే ఆశ అని అన్నారు. అదేవిధంగా అజిత్ కుమార్‌కు బైక్ రేస్‌పై ఉన్న ఆసక్తిని చూసి తనకు ఏదైనా చేయాలని అనిపించింది అన్నారు. అజిత్ మనసుకు నచ్చిన విషయాన్ని చేయడానికి కొంత సమయాన్ని కేటాయిస్తారని, అలా ఆయన ప్రభావం తనపై పడిందన్నారు. మనం సరిగా ఉపయోగిస్తే ఏదైనా సరిగా పనిచేస్తుందని అజిత్ చెప్పారన్నారు. కాగా నటుడు అజిత్ మాదిరిగానే నటి మంజు వారియర్ కూడా బీఎండబ్ల్యూ మోటార్ బైక్‌ను కొనుగోలు చేసి ఆ మధ్య అజిత్ తో కలిసి కొన్ని దేశాలు ప్రయాణంచడం గమనార్హం.
మంజు
వారియర్
Comments
Please login to add a commentAdd a comment