కాదల్ ఎన్బదు పొదువుడమై
ప్రేమికుల రోజున
తిరు మాణిక్యం చిత్రం ఆడియోను ఆవిష్కరించిన అమీర్ తదితరులతో యూనిట్ సభ్యులు
తమిళ సినిమా: నటుడు వినీత్, లిజోమోల్, నటి రోహిణి, కలేష్, దీప తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం కాదల్ ఎన్బదు పొద్దు పొడమై. జయ ప్రకాష్, రాధాకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను బోఫ్టా జి ధనుంజయన్ పొంది తన క్రియేటివ్ ఎంటర్‌టెయిన్ అండ్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ద్వారా వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర విరాలను దర్శకుడు తెలుపుతూ ప్రేమ అనేది మనుషుల్లో సహజంగా కలిగే విషయమే అయినా అందుకుంటూ కొన్ని విధి విధానాలను విధించుకుంటున్నారన్నారు. అలా ఈ సమాజంలో ప్రేమకు సంబంధించిన సైకిలాజికల్ కొన్ని ముఖ్యమైన సమస్యలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఇది ఉంటుందన్నారు. తెలంగాణ గ్యాప్ తర్వాత వినీత్ ఈ చిత్రం ద్వారా రియంట్రీ అవుతున్నారని చెప్పారు ఇది ఆయన కెరీర్‌లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందన్నారు. కాగా ఈ చిత్రం గోవా, పూణే తదితర అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శింపబడి ప్రేమలో సైకిలాజికల్ సమస్యలను చక్కగా చూపించి అందరూ చూడాల్సిన చిత్రంగా ప్రశంసలు అందుకుందన్నారు. కాగా ఇది కచ్చితంగా తమిళ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు.
కాదల్ ఎన్బదు పొదువుడమై చిత్రంలో ఓ దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment