కథ విన్న వెంటనే నిర్ణయించాను!
తమిళ సినిమా: జీపీఆర్‌కే సినిమాస్ పతాకంపై రవికుమార్ నిర్మించిన చిత్రం తిరు మాణిక్యం. నందా పేరియసామి కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఇందులో నటుడు సముద్రఖని ప్రధాన పాత్రను పోషించారు. ఒక సాధారణ వ్యక్తి ఇతివృత్తంతో సాయం అనే ప్రధాన అంశంతో పలు అనూహ్యమైన మలుపులతో సాగే కథా చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 27వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అమీర్, విక్రమన్, లింగుస్వామి మొదలగు పలువురు సినీ ప్రముఖులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తాను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ చిత్రం చేసినట్లు చెప్పారు. తన మిత్రుడు రాజా సెంథిల్ దర్శకుడు నందా పెరియస్వామిని పరిచయం చేశారని చెప్పారు. ఆయన కథ చెప్పగానే తనకే దుఃఖం వచ్చిందన్నారు. దీంతో వెంటనే చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించినట్లు చెప్పారు చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులందరూ బాగుందని ప్రసంచించారన్నారు ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుందనే అభిప్రాయాన్ని ప్రయత్నం చేశారు. చిత్ర కథానాయకుడు సముద్రఖని మాట్లాడుతూ అన్ని చిత్రాలకు శ్రమిస్తున్నామని, అందరూ విజయం కోసమే క్షమిస్తున్నామని అన్నారు .పరుత్తి వీరన్, సుబ్రహ్మణ్యపురం వంటి మనం చూసిన విజయాలను అధిగమించడానికి సమిస్తున్నట్లు చెప్పారు. అప్ప చిత్రం అనంతరం ఏడేళ్ల గ్యాప్ తరువాత తమిళంలో ఈ చిత్రాన్ని చేసే అవకాశం వచ్చినట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం మంచి మనుషులు కలిశారని అన్నారు. కొన్ని చిత్రాలకే అన్ని తాగా అమతాయని దర్శకుడు నంద కథ చెప్పగానే ముందు వెళ్లి దర్శకుడు భారతీరాజాకు కథ వినిపించు ఆయన ఓకే అనగానే చిత్రాన్ని ప్రారంభిద్దాం అని చెప్పానన్నారు. భారతి రాజా ఓకే చెప్పగానే ఒక్కొక్కరు ఇచత్వంలోకి వచ్చారన్నారు. చాలా మంచి వ్యక్తి అని ఎప్పుడు చిరునవ్వుతోనే కనిపిస్తారని అన్నారు. మంచి కథను చిత్రంగా రూపొందిస్తున్నాం అన్న భావన మాత్రమే ఆయన మనసులో ఉండేదన్నారు. ఈ చిత్రం మంచి హిట్ అయ్యి దర్శకుడు నందా పెరియ స్వామికి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment