తీవ్ర అల్పపీడనంగా ఉపరితల ద్రోణి
సాక్షి, చైన్నె : బంగాళాఖాతంలో నెలకొన్న ద్రోణి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలో బుధవారం చిరు జల్లులతో ఊడిన వర్షం పడింది. ఈ వర్షాలు మరింతగా కొనసాగనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతీ బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఒకే చోట కేంద్రీ కృతమై ఉంది. ఈ ప్రభావంతో చైన్నె శివారు జిల్లాలో చిరు జల్లులతో పాటుగా చలి గాలులు వీస్తున్నాయి. సముద్రంలో అలల తాకిడి అధికంగా ఉంది. ఈ తీవ్ర అల్పపీడనం 24 గంటలలో వాయువ్య దిశలో పయనించనుంది. ఉత్తర తమిళనాడులోని చైన్నెకు సమీపంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి ఇది వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్ వైపుగా కదిలే అవకాశాలు అధికంగా ఉండడంతో చైన్నె, శివారు జిల్లాలో మోస్తరుగా వర్షాలు ఈనెల 24వ తేదీ వరకు ఎదురు చూడవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఫెంగల్ తుపాన్ సృష్టించిన విలయ తాండవంతో తమకంటే తమకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ విల్లుపురం, కడలూరులలో బుధవారం కూడా ఆందోళనలుపలు చోట్లకొనసాగాయి. బాధితులకు మద్దతుగా విల్లుపురంలో ఈనెల 21న భారీ నిరసనలకు అన్నాడీఎంకే పిలుపు నిచ్చింది.
జైలుశిక్ష రద్దు చేయాలని కోరుతూ పిటిషన్
కొరుక్కుపేట: కళ్లకురిచ్చిలోని కరుణాపురం ప్రాంతంలో కల్తీసారా తాగి 60 మందికి పైగా మృతి చెందిన కేసులో అరెస్టయిన 18 మందిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. గ్యాంగ్‌స్టర్ చట్టం కింద విధించిన జైలుశిక్షను రద్దు చేయాలని కోరుతూ 18 మంది తరఫున దాఖలైన పిటిషన్‌ను బుధవారం సెషన్‌లో విచారించిన న్యాయమూర్తి ఎస్.ఎం. సుబ్రమణ్యం, ఎం. జోతిరామన్ వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్ బి.ఎస్.రామన్ అన్ని కేసుల్లో రిప్లై దాఖలు చేశామని, తుది విచారణ కోసం జనవరి 6కి వాయిదా వేయాలని కోరారు. దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. ఎన్నో ఏళ్లుగా నకిలీ సారా విక్రయిస్తున్నామని తెలిపారు. విషజ్వరంతో మృతి చెందడంతో జిల్లావ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. ఇన్నాళ్లుగా కల్తీ సారావిక్రయాలు జరుగుతుంటే.. అడ్డుకోకుండా ఎకై ్సజ్ శాఖ ఏం చేస్తోంది? ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అనంతరం కేసు విచారణ 6వ తేదీకి వాయిదా పడింది.
లంచం కేసులో
జీఎస్టీ అధికారి అరెస్టు
సాక్షి, చైన్నె : మదురైలో లంచం వ్యవహారంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి ఒకరు, మరో ఇద్దరు పోలీసులను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. తమకు అందిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు మదురై సెంట్రల్ క్రైం పోలీసు స్టేషన్‌లో ఇద్దరు పోలీసుఅ ధికారుల నుంచి రూ. 3.50 లక్షలు సీజ్ చేశారు. ఇది లంచంగా తీసుకున్నట్లు గుర్తించారు. దీని వెనుక జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ శరవణకుమార్ ఉన్నట్టు విచారణలో తేలింది. దీంతో ఈ ముగ్గుర్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా తిరువిడై మరుదురులోని జీఎస్టీ అధికారి ఇంట్లో సోదాలలో సిబీఐ నిమగ్నమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి.
అంబేడ్కర్‌ను అవమానిస్తారా?
● బీజేపీపై నేతల ఫైర్
సాక్షి, చైన్నె: పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాట డీఎంకేతో పాటు పలు పార్టీలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంలో అమిత్ షా పేరు ఎత్తకుండా సీఎం స్టాలిన్ స్పందిస్తూ, పాపాలు అధికంగా చేసే వాళ్లేపుణ్యాల మీద దృష్టి పెడుతారని మండిపడ్డారు. అన్నాడీఎంకే నేత జయకుమార్ స్పందిస్తూ, ఇందుకు బీజేపీ త్వరలో భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం అన్నారు. అంబేడ్కర్‌ను అవమానిస్తే సహించమని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యలను వీసీకే నేత తిరుమావళవన్ ఖండించారు. ఇక, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందిస్తూ అంబేడ్కర్‌కు అధిక ప్రాధాన్యత బీజేపీ ప్రభుత్వం ద్వారానే దక్కిందన్నారు.
ఛలో రాజ్ భవన్
సాక్షి, చైన్నె : అదానీ వ్యవహారం, మణిపూర్ ఘటనలు తదితర అంశాల గురించి పార్లమెంట్‌లో ప్రతి పక్షాలను మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటున్నారనే ఆగ్రహంతో తమిళనాడు కాంగ్రెస్ నేతృత్వంలో బుధవారం ఛలో రాజ్ భవన నిరసన కార్యక్రమం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై నేతృత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఉదయం నిరసన నిమిత్తం సైదాపేట పనగల్ మాళిగై వద్దకు తరలి వచ్చారు. కేంద్రంలోని బీజేపీ పాలకులకు వ్యతిరేకంగా నినాదాలను హోరెత్తించారు. ఇక్కడి నుంచి ర్యాలీగా గిండిలోని రాజ్ భవన్‌ను ముట్టడించేందుకు బయలుదేరారు. వీరిని మార్గం మధ్యలో పోలీసులు అడ్డుకుని బుజ్జగించారు. అనంతరం అరెస్టు చేసి విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment