రూ. 111 కోట్లతో 10 వృత్తి శిక్షణ కేంద్రాలు
● మంత్రి సీవీ గణేశన్
సాక్షి, చైన్నె: ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో తమిళనాడులో రూ. 111 కోట్లతో ప్రభుత్వం 10 వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిని ఆ శాఖమంత్రి మంత్రి సీవీ గణేశన్ ప్రారంభించారు. యువత ఉపాధి కల్పన, నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా దిండిగల్ జిల్లా కుజిలియంపరై, నామక్కల్ జిల్లా సేంతా మంగళం, పుదుకోట్టై జిల్లా గంధర్వకోట్టై, రామనాథపురం జిల్లా కౌముది, తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి, తిరువారూర్ జిల్లా కూతా నల్లూర్, తిరువణ్ణామలై జిల్లా సెంగం, తూత్తుకుడి జిల్లా ఏరెల్ లో 10 చోట్ల రూ. 111 కోట్లతో కొత్త ప్రభుత్వ వృత్తి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌముదిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వీటిని మంత్రి సీవి గణేషన్ ప్రారంభించారు.ఈ వృత్తి విద్యా శిక్షణా సంస్థల ద్వారా 10వ తరగతి విద్యార్థులు అధునాతన సీఎన్‌సీ వంటి పరిశ్రమ 4.0 ప్ర యోజనం పొందుతారని మంత్రి ఫ్రకటించారు. మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇండస్ట్రియల్ రోబో టిక్స్, డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ (ఇండస్ట్రియల్ రోబోటిక్స్ – డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్), తయారీ ప్రక్రియ ఆటోమేషన్, విండ్ ప్లాంట్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, సెంట్రల్ ఎయిర్ కండిషన్ ప్లాంట్ మెకానిక్, ఏరోనాటికల్ ఫిట్టర్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ తదితర వృత్తి సంబంధిత శిక్షణ ఇక్కడఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే 8వ తరగతి వరకు చదువుకున్న వారికి వెల్డర్, ప్లంబర్, డ్రెస్ మేకింగ్ శిక్షణలు అందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది మరో 1,192 మంది విద్యార్థులుకు అదనంగా శిక్షణ కల్పించే అవకాశం దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్మిక సంక్షేమం , నైపుణ్యాభివృద్ది శాఖ కార్యదర్శి వీర రాఘవరావు, ఉపాధి , శిక్షణ శాఖ డైరెక్టర్ విష్ణు చంద్రన్, రామనాథపురం జిల్లా కలెక్టర్ సిమ్రాన్ జిత్ సింగ్ కలోన్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment