కాశీమాకు రూ. కోటి నజరానా
సాక్షి, చైన్నె: క్యారమ్స్‌లో విశ్వవిజేతగా నిలిచిన కాశీమాకు రూ. కోటి నగదు కానుకను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఆమెతోపాటు అమెరికాలో పోటీలలో పాల్గొన్న మరో ఇద్దరికి తలా రూ. 50 లక్షలను డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ బుధవారం అందజేశారు. వివరాలు.. చైన్నె న్యూ వాషర్‌మెన్ పేటకు చెందిన మెహబూబ్ భాషా కుమార్తె కాశీమా గత నెల అమెరికాలో జరిగిన పోటీలకు తమిళనాడు నుంచి భారత దేశం తరపున ప్రపంచ 6వ క్యారమ్స్ పోటీలలో పాల్గొన్నారు. ఆమెతో పాటు చైన్నె వ్యాసార్పాడికి చెందిన నాగ జ్యోతి, మదురైకు చెందిన మిత్రాలు కూడా వెళ్లారు. వీరి అమెరికా పయనానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించింది. ఈ టోర్నీ ఫైనల్స్ కాశీమా సింగిల్స్, డబుల్స్, టీమ్ విభాగాలలో తన సత్తా చాటారు. క్యారమ్స్ విశ్వ విజేతగా నిలిచి మూడు బంగారు పతకాలను కై వసం చేసుకున్నారు. నాగ జ్యోతి, మిత్రాలు తలా ఓ బంగారు పతకాలను దక్కించుకున్నారు. చైన్నెకు చేరుకున్న వీరిని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అభినందించారు. అయితే, వీరికి మరింత ప్రోత్సహం అందించే విధంగా ఎలాంటి నజరాన ప్రకటించ లేదు. అదే సమయంలో చెస్ విశ్వ ఛాంపియన్ గుకేశ్‌కు రూ. 5 కోట్లు నజరాన ఇచ్చిన నేపథ్యంలో క్యారమ్స్ విజేతల ప్రస్తావన అన్నది సామాజిక మాధ్యమాలలో హోరెత్తాయి.
భారీ నజరానా..
అమెరికాలో జరిగిన 6వ ప్రపంచ క్యారమ్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకాలు సాధించిన వారిని ప్రోత్సహించే రీతిలో బుధవారం క్రీడల మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నిర్ణయించారు. రూ. 2 కోట్ల నజరాన ప్రకటించారు. చైన్నెకి చెందిన ఆటో డ్రైవర్ మెహబూబ్ భాషా కుమార్తె, తేనాంపేట మహిళా కళాశాల విద్యార్ధిని ఎం. కాశిమాకు రూ. ఒక కోటి నజరాన , మిగిలిన ఇద్దరికి తలా రూ. 50 లక్షలు చొప్పున అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వీరిని సచివాలయానికి పిలిపించి ప్రోత్సాహక నగదునుకు గాన చెక్కును ఉదయ నిధి స్టాలిన్ అందజేశారు. ఇప్పటికే వీరితో పాటు కోచ్ మరియం ఇరుదయం అమెరికాకు వెళ్లేందు కోసం తలా 1.50 లక్షలు చొప్పున రూ. 6 లక్షలు అందజేసిన ప్రభుత్వం, తాజాగా క్రీడాకారిణులను ప్రోత్సహిస్తూ నజరాన అందజేయడం విశేషం. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్ర, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్‌అథారిటీ సీఈఓ,సభ్య కార్యదర్శిజే మేఘనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్యారమ్స్ విశ్వ విజేతకు గుర్తింపు
మరో ఇద్దరికి తలా రూ. 50 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment