కలైంజ్ఞర్ కలల గృహాలకు రూ. 400 కోట్లు
● ఉత్తర్వులు జారీ చేసిన సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: కలైంజ్ఞర్ కలల గృహాల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్లను కేటాయించింది. లక్ష కాంక్రీట్ ఇళ్ల నిర్మించడమే లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి బుధవారం సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024–25 సంవత్సరంలో ‘‘కలైంజ్ఞర్ కలల గృహం’’ పథకం మేరకు లక్ష గృహాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఒక్కో ఇంటికి రూ. 3,50,000 అందించేందుకు చర్యలు తీసుకున్నారు. మొత్తంగా ఒక లక్ష గృహాల నిర్మాణానికి రూ.3500 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించారు. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో అందరికి గృహం నినాదంతో 2030 నాటికి 8 లక్షల గృహాలను నిర్మించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో లక్ష ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇప్పటికే మంజూరు చేశారు. 360 చదరపు అడుగులతో లబ్దిదారులకు ఈ గృహాలను నిర్మించి ఇవ్వనున్నారు. ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వం ఈ గృహ పథకం కోసం రూ.1051.34 కోట్ల నిధుల కేటాయించింది. ఈ పథకానికి లబ్దిదారుల నుంచి విశేష స్పందన వస్తుండటంతో లక్ష గృహాల లక్ష్యాన్ని విస్తృతం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రూ.400 కోట్లు నిధులను విడుదల చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ. 1451 కోట్లు కేటాయించి, లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో వారికి జమ చేశారు.
తిరుచ్చిలో కలైంజ్ఞర్ గ్రంథాలయం
రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో కలైంజ్ఞర్ పేరిట అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రంథాలయలను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసింది. ప్రస్తుతం తిరుచ్చి టీవీఎస్ టోల్‌గేట్ సమీపంలోని 4.57 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మాండ గ్రంథాలయం నిర్మించనున్నారు.అంతర్జాతీయ ప్రమాదాలతో 8 అంతస్తులతో ప్రజాపనుల శాఖ ఈ పనులను చేపట్టనుంది. దీనిని గ్రంథాలయంగా, నాలెడ్జె సెంటర్‌గా, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దేవ విధంగా నిర్మాణ పనులకు రూ. 290 కోట్లను కేటాయిస్తూ సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment