
శ్రుతిహాసన్
తమిళసినిమా: సంచలన నటీమణుల్లో శ్రుతిహాసన్ ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. చాలా బోల్డ్ నటి ఈమె. నచ్చింది చేయడం, నచ్చకపోతే నో అని నిర్మొహమాటంగా చెప్పే నటి శుృతిహాసన్. ఇలానే ఇటీవల ఒక తెలుగు చిత్రం నుంచి వైదొలగి వార్తల్లోకి ఎక్కారు. పెళ్లి వద్దు, సహజీవనం ముద్దు అని చెప్పే గట్స్ ఉన్న నటి ఈ భామ. అయితే వివాహమనేది పవిత్రమైనదని, పెళ్లి చేసుకోవడానికి తనకలాంటి వ్యక్తి ఇప్పటి వరకు తారసపడలేదని అంటారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో శ్రుతి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో చేసిన పోస్ట్‌లో తాను క్రిస్మస్ రోజు కూడా కూలీ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నానని చెప్పారు. గత ఏడాది కూడా క్రిస్మస్ రోజున క్రాక్ అనే తెలుగు చిత్ర షూటింగ్‌లో ఉన్నట్లు గుర్తు చేశారు. తనకు లోకేష్‌కనకరాజ్ చిత్రాలంటే చాలా ఇష్టమని ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నానని, అది కూలీతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. రజనీతో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు.
ఆయన నుంచి చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. ఇకపోతే ఈ అమ్మడు త్వరలో ధనుష్‌తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ఈమె ఇంతకుముందు ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది కూడా. త్వరలో సలార్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. ఇందులోనూ శ్రుతిహాసన్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.