ట్రేడ్ సెంటర్‌లో ఆటోమేషన్ ఎక్స్‌పో సౌత్–2025
కొరుక్కుపేట: చైన్నె ట్రేడ్ సెంటర్ వేదికగా ఐఈడీ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూడు రోజుల ఆటోమేషన్ ఎక్స్‌పో సౌత్ – 2025 గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గౌరవ అతథిగా తమిళనాడు ఎంఎస్‌ఎంఈ విభాగం – ఈఎంఈఏ గ్లోబల్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెల్యూషన్స్ జనరల్ మేనేజర్ మ్యాథీసన్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఐఈడీ కమ్యూనికేషన్స్ లిమిటెడ వ్యవస్థాపకులు, ఎండీ డాక్టర్ ఎం. ఆరోగ్యస్వామి దాదాపు 300 ఎగ్జిబీటర్లు పాల్గొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ తదితర అత్యాధునిక ఉత్పత్తులతో స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా, 20,000 మందికిపైగా విజిటర్లు పాల్గొన్నారు. ఈఎక్స్ పో ఈనెల 8వ తేదీతో ముగుస్తుందని నిర్వాహకుల వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment