అన్నానగర్: చైన్నె సమీపం నెమిలిచ్చేరి క్రోంపేట డాక్టర్ అంబేడ్కర్ వీధికి చెందిన కార్తీక్ (41). ఇతను చైన్నెలోని జబర్‌గావ్‌పేటలో నివాసముంటున్న మధుహరికృష్ణారెడ్డి కుండ్రత్తూరు పక్కనే ఉన్న విరుగంపాక్కం గ్రామంలో అతని అన్నదమ్ములు మూర్తి, రేవతి దంపతులకు చెందిన 3.37 ఎకరాల భూమి ఉంది. భూమిపై రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో రికవరీ కాలేదు. తగిన మొత్తం చెల్లించి ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ప్లాట్లుగా విభజించి విక్రయించుకోవచ్చని కార్తీక్‌ను నమ్మించారు. నమ్మిన కార్తీక్ ఆ ప్లాట్లకు మొత్తం రూ.22 కోట్ల 75 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత ఆ స్థలాన్ని కార్తీక్ కు ఇవ్వకుండా మరో వ్యక్తికి అద్దెకు ఇచ్చి మోసానికి పాల్పడ్డారని తెలిసింది. కార్తీక్ ఫిర్యాదు మేరకు ఆవడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి మధుహరి కృష్ణారెడ్డిని గురువారం అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment