సాక్షి, చైన్నె : చైన్నె ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న ఆర్ సుధాకర్‌ఐపీఎస్ కేంద్ర ప్రభుత్వ విధులకు వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు గురువారం సంకేతాలు వెలువడ్డాయి. ఆయన మాధక ద్రవ్యాల నియంత్ర విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. తమిళనాడు బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్న సుధాకర్ ఇక్కడే పలు చోట్ల పనిచేశారు. అవగాహన కారక్రమాలలో గానీయండి, విధుల పరంగా గానీయండి చక్కటి ప్రతిభతో ముందుకెళ్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ప్రభుత్వ విధులకు వెళ్లబోతున్నారు. కాగా, ఇటీవల కాలంగా తమిళనాడుకు చెందిన పలువురు ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు కేంద్ర ప్రభుత్వ విధులకు వెళ్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment