● ఐడీసీ సెంటర్‌ | - | Sakshi
Sakshi News home page

● ఐడీసీ సెంటర్‌

Published Fri, Mar 7 2025 10:00 AM | Last Updated on Fri, Mar 7 2025 9:56 AM

● ఐడీసీ సెంటర్‌

● ఐడీసీ సెంటర్‌

డిజిటల్‌ సామర్థ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా వెర్షన్‌–1 బెంగళూరు ఇండియా సంస్థ స్థానికంగా తన ఐడీసీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.డిజిటల్‌ పరివర్తన, పరిష్కారాలను మరింతగా ఖాతాదారులకు చేరువ చేసే విధంగా ఏర్పాటు కేసిన ఈ సెంటర్‌ను గురువారం నాస్కామ్‌ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ శ్రీనివాసన్‌, ఎంటర్‌ ప్రైజ్‌ ఐర్లాండ్‌ అండ్‌ సౌత్‌ ఆసియా డైరెక్టర్‌ రాస్‌ కుర్రాన్‌, ఐడీసీ నార్త్‌ అమెరికన్‌ ఆపరేషన్స్‌ ఎండీ గణేష్‌ కల్యాణరామన్‌ ప్రారంభించారు. – సాక్షి, చైన్నె

చైన్నెలో రూ.456 కోట్లతో రోడ్ల మరమ్మతులు

తిరువొత్తియూరు: చైన్నెలో పలు రోడ్లు గుంతలమయమయ్యాయి. దీని గురించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం రోడ్లు మరమ్మతులు పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు 2025–2026 ఆర్థిక సంవత్సరంలో రూ.456 కోట్లతో చైన్నె కార్పోరేషన్‌ పరిధిలో రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభం కానున్నాయి. ఇలా 570 కి.మీ. పొడవైన 3,505 రోడ్లను మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ రోడ్డు పనులకు తమిళనాడు అర్బన్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ కింద 150 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖ తరఫున 60 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు.

నేడు సీఐఎస్‌ఎఫ్‌ వ్యవస్థాపక దినోత్సవం

సాక్షి, చైన్నె: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) 56వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం జరగనున్నది. ఈ కార్యక్రమం నిమిత్తం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా రాష్ట్రానికి చేరుకున్నారు. అరక్కోణం సమీపంలోని వైమానిక దళం కేంద్రానికి గురువారం రాత్రి సమయంలో చేరుకున్న అమిత్‌ షా రోడ్డు మార్గంలో తక్కోళం వెళ్లారు. అక్కడ రాత్రి బస చేశారు. శుక్రవార ఉదయాన్నే అక్కడ జరిగే సీఎస్‌ఎస్‌ఎఫ్‌ పరేడ్‌, వ్యవస్థానక దినోత్సవ వేడుకలలో పాల్గొననున్నారు. అలాగే సురక్షిత్‌ తత్‌, సమృద్ధి భారత్‌ (సురక్షిత తీరాలు, సంపన్న భారతదేశం) అనే నినాదంతో భారతదేశంలోని మొత్తం 6,553 కిలోమీటర్ల ప్రధాన భూభాగ తీరప్రాంతంలో సాగనున్న సైక్లో థాన్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

వృద్ధురాలికి 15 కత్తిపోట్లు

ఇంజినీర్‌ అరెస్టు

సేలం: మైలాడుదురై టెలికామ్‌ నగర్‌ 2వ క్రాస్‌ వీధికి చెందిన సేతుమాథవన్‌ (62). ఇతని భార్య నిర్మల (60). వీరి ఎదురింటిలో నివసిస్తున్న రాజేంద్రన్‌ కుమారుడు ప్రేమ్‌ (24). ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు. ఇతని కుటుంబానికి నిర్మలా కుటుంబంతో తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఈ స్థితిలో గురువారం ఉదయం 10 గంటలకు నిర్మల బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన స్థితిలో ఇంటిముందు ప్రేమ్‌తో గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన ప్రేమ్‌ కత్తితో నిర్మలను 15 పోట్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడి నిర్మల కుప్పకూలింది. స్థానికిలు ఆమెను తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మైలాడుదురై పోలీసులు ప్రేమ్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

రోడ్డు విస్తరణకు అనుమతి

కొరుక్కుపేట: చైన్నెలోని నుంగంబాక్కం, అన్నానగర్‌ ప్రాంతాలను కలిపే నెల్సన్‌ మాణిక్యం రోడ్డులో గత కొనేళ్లుగా ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతోంది. దీంతో ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనాలుదారులతోపాటు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో నెల్సన్‌ మాణిక్యం రోడ్డును విస్తరించాలని చైన్నె కార్పొరేషన్‌ నిర్ణయించింది. దీనికి కార్పొరేషన్‌ ఆమోదం తెలిపింది. భూమిని సేకరించి రోడ్డును వెడల్పు చేయనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య తీరుతుందని కార్పొరేషన్‌ అఽధికారులు వెల్లడించారు. మహిళల కోసం 8 మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement