నియోజకవర్గాన్ని కుటుంబంగా భావించాలి
వేలూరు: నియోజకవర్గాన్ని వారి కుటుంబంగా భావించి అభివృద్ధి చేయాలని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. కాట్పాడిలోని ఓ ప్రయివేటు కళ్యాణ మండపంలో శిశు సంక్షేమ శాఖ, అంగన్‌వాడీ కార్యకర్తలతో కాట్పాడి బ్లాక్‌లోని గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్రమం కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి కుటుంబసమేతంగా పాల్గొని గర్భిణులకు వరుస తాంబూలాలను అందజేసి ప్రసంగించారు. కాట్పాడి నియోజకవర్గాన్ని తాను ఒక కుటుంబంగా భావించి సేవ చేయడంతోనే తనకు తన నియోజకవర్గ ప్రజలు గత 50 సంవత్సరాలుగా గెలిపిస్తున్నారన్నారు. గర్భిణులు మంచి పౌష్టికాహారాన్ని తీసుకొని సమాజానికి మంచి ఆరోగ్యకరమైన చిన్నారికి జన్మనియ్యాలన్నారు. గర్భిణులకు తరచూ వైద్య పరీక్షలు చేసేందుకు ఇప్పటికే ఆయా ప్రాంతంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీ కదీర్ ఆనంద్, ఆయన సతీమణి సంగీత, మంత్రి దురైమురుగన్, సతీమణి శాంతకుమారి, ఎమ్మెల్యే అములు, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, జోన్ చైర్మన్ పుష్పలత, యూనియన్ చైర్మన్ వేల్‌మురుగన్ పాల్గొన్నారు.
తిరువళ్లూరులో సామూహిక సీమంతాలు
తిరువళ్లూరు: తిరువళ్లూరు నియోజకవర్గంలోని 252 మంది గర్భిణులకు సాంఘిక సంక్షేమశాఖ ఆద్వర్యంలో గురువారం ఉదయం పట్టణంలోని ప్రయివేటు కల్యాణ మండపంలో సామూహిక శీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా గర్బణి మహిళలకు సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తిరువళ్లూరు నియోజకవర్గంలోని పూండి, కడంబత్తూరు, తిరువళ్లూరు మున్సిపాలిటీ, తిరువేళాంగాడు ప్రాంతాలకు చెందిన 252 మంది గర్బణులకు సామూహిక సీమంతాలను నిర్వహించారు. ప్రాజెక్టు డైరెక్టర్ లలిత మాట్లాడుతూ గర్బణి మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరారు. శిశువు ఆరోగ్యంగా జన్మించడం, సంవత్సరం వరకు శిశువుకు తల్లిపాలు పట్టడం మంచిదన్నారు.
నియోజకవర్గాన్ని కుటుంబంగా భావించాలి
Comments
Please login to add a commentAdd a comment