హత్య కేసులో నిందితుడి అరెస్ట్
సేలం: తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి సమీపంలోని ఎట్టయపురం, మేలనంబిపురం తూర్పు వీధికి చెందిన వ్యక్తి పూవన్. మాజీ ఉపాధ్యాయుడైన ఇతని భార్య సీతాలక్ష్మి (75). వీరి కమార్తె రామజయంతి (45). ఈమె గత కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి తల్లి సీతాలక్ష్మితో ఉంటోంది. ఈ స్థితిలో గతవారం దేవాలయానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తల్లి, కూతురు హత్యకు గురయ్యారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సీతాలక్ష్మి, రామజయంతి ధరించిన 13 సవర్ల బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు. దోపిడీ దొంగలు నగల కోసం వీరిని చంపినట్టు పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై ఇద్దరిని అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఈక్రమంలో ప్రధాన నిందితుడిని పట్టుకోవడం కోసం 9 ప్రత్యేక బృందాలుగా పోలీసులు గాలిస్తూ వచ్చారు. అడవిలో దాక్కొని ఉన్న ప్రధాన నిందితుడు మునీశ్వరన్‌ను గురువారం ఉదయం తూత్తుకుడి మదురై జాతీయ రహదారిపై కీల్ ఈరల్ ప్రాంతం సమీపంలో పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నం చేశారు. మునీశ్వరన్ కత్తిలో పోలీసులపై దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు తుపాకీతో కాల్చడంతో మునీశ్వరన్ ఎడమ చేయికి గాయమైంది. తర్వాత పోలీసులు మునీశ్వరన్‌ను అరెస్టు చేసి, తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సమయంలో గాయపడిన ఏఎస్‌ఐ ముత్తురాజ్ సహా పోలీసులు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment